హిందీ మూలం : శ్రీ కృష్ణ చందర్
బాధ్యత
రాత్రి వచ్చిన తీవ్రమైన గాలి, వానకు సెక్రటేరియేట్ లాన్ లో వున్న పెద్ద నేరేడు చెట్టు నేలమట్టమైంది.
ఉదయాన్నే మాలి వచ్చి చూస్తే ఆ చెట్టుక్రింద ఒక మనిషి పడిపోయి వున్నాడు. అతని తుంటి మీద చెట్టుకాండం పడివుంది. మాలి పరుగుపరుగున వెళ్ళి బంట్రోతుకు చెప్పాడు. ఆ చప్రాసి పరుగు పరుగున వెళ్ళి గుమస్తాకు చెప్పాడు. ఆ గుమస్తా పరుగు పరుగున సూపరింటెండెంట్ దగ్గరికెళ్ళాడు. సూపరింటెండెంట్ పరుగు పరుగున లాన్ లోకి వచ్చాడు. నిముషాల్లో పడిపోయిన చెట్టు క్రింద నలిగిపోతున్న మనిషిచుట్టూ పెద్ద గుంపు పోగయ్యింది.
"పాపం నేరేడుచెట్టు ఎన్ని పండ్లిచ్చేది!" ఒక క్లర్క్ సానుభూతి.
"ఆ.. దీని పండ్లు ఎంతో రుచిగా వుండేవి” మరో... రసానుభూతి.
"ఈ పండ్లఋతువులో సంచినిండా పండ్లను ఇంటికి తీసుకెళ్ళే వాడిని. పిల్లలు చాలా ఇష్టంగా తినేవారు" ఇంకో పండ్ల ప్రేమికుని దుఃఖానుభూతి.
"కాని అయ్యా! ఆ మనిషి...." మాలి చెట్టుక్రింద మనిషిని చూపించాడు.
"ఔను ఈ మనిషి?” సూపరింటెండెంట్ ఆలోచనలో పడ్డాడు.
"చచ్చిపోయాడో ? బతికున్నాడో?" బంట్రోతు సందేహం.
“చచ్చిపోయుంటాడు. ఇంత పెద్ద చెట్టు మీద పడితే ఇంకా ఎలా బతికుంటాడు?” రెండో బంట్రోతు నిర్ణయించేశాడు.................