లాపత
రఫీఖా ముఖం చూస్తున్నాకొద్దీ ముచ్చటేస్తుంది అబ్దుల్ అబ్బాసు. మాసిన కిటికీలోంచి ఆమె ముఖంపై పడుతున్న సాయంకాలపు ఎండ కొత్త మెరుపులను పుట్టిస్తున్నది. మెత్తటి నవ్వు చెదరకుండా, కన్ను మలపకుండా రఫీఖానే చూస్తున్నాడు. 'ఇంతటి నిర్మలమైన మనిషి. చిన్న ప్రపంచమైనా చక్కగా తీర్చిదిద్దుకుంటుంది' అనుకున్నాడు. ఇదేమీ పట్టించుకోకుండా కొడుకు లాల్చీకి ఊడిన గుండీని కుడుతున్నది ఆమె.
"పిల్లల కోసం పనులు చేయాలంటే ఎంత తన్మయత్వంలో మునిగిపోతారో కదా ఈ తల్లులు. వాడిని ఇచ్చిన మొగుడ్ని మటుకు పక్కనే ఉన్నా అస్సలు పట్టించుకోరు. వచ్చి ఇంతసేపైంది. ఎదురుగానే కూర్చున్నా ఒక్కసారైనా తల పైకెత్తదే! పిల్లలు పుట్టాక అమ్మలు అందరూ ఇట్లాగే తయారవుతారేమో' సాలోచనగా మనసులోనే అనుకుంటూ ఆమెనే పరిశీలిస్తున్నాడు. కాసేపటికే వాటి పని ముగించి అంతసేపూ కూర్చున్న హాలు అనుకునే చిన్న గదినుంచి వంటగదిలోకి వెళ్ళింది.
'చాయ్ తాగుతావా?' అడిగింది..................