• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

David Harve Pettubadi Edu Pradhamika Vairudhyaalu

David Harve Pettubadi Edu Pradhamika Vairudhyaalu By D Ramesh Patnaik

₹ 200

ఆలోచనాత్మక రచన (సందేశం)
 

- పాణి

మిత్రుడు కా. రమేష్ పట్నాయక్ గారి రచనలు చాలా కాలంగా చదువుతున్నాను. లోతైన విషయాలను సులభంగా చెప్పడానికి ప్రయత్నిస్తున్న మార్క్సిస్టు ఆలోచనాపరు డాయన. అట్లని విషయాన్ని పలుచన చేయకుండా, జనరంజకత్వంలోకి జారి పోకుండా గంభీరమైన విశ్లేషణా స్వరంతో దేన్నయినా చర్చించడం ఆయన పద్ధతి. ప్రగతిశీల శిబిరం లోపలా, చుట్టూ ఉండే పాఠకులేగాక న్యాయా న్యాయాల చర్చలోకి వెళ్లితే న్యాయం పక్షాన నిలబడగల అవకాశం ఉన్న వాళ్లందరూ తన పాఠకులు అనుకొని రాస్తారు. వీలైనంత విశ్లేషణ, దానికి అవసరమైన సమాచారం అందిస్తూ నిరలంకారంగా, నేరుగా మౌలిక విషయం దగ్గరికి పాఠకులను జాగ్రత్తగా తీసి కెళ్లడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా పాఠకులు ఏ వైఖరి తీసుకోవాలో సూచిస్తూ ఆయన రచన సాగుతుంది.

ఒక రచయితకు తానే చెప్పవలసిన అంశం ఏమిటో తెలిసి ఉంటేనే తన పాఠ కులు ఎవరో స్పష్టత వస్తుంది. ఏం రాయలో, ఎందుకు రాయాలో, ఎలా రాయాలో స్పష్టత ఉండటం బుద్ధిజీవులకు గౌరవాన్ని ఇస్తుంది. సీరియస్ ఇమేజ్ను తెస్తుంది. అప్పుడు తప్పక ఆ రచనలు ప్రభావం వేస్తాయి. ఈ వైపు నుంచి రమేష్ పట్నాయక్ గారిని చూడాలి. ఆయన సీరియస్ విషయాలను పాపులర్గా చెప్పే రచయిత కాదు. నేను చెబుతున్నాను. వినండి అనే పద్ధతిలో రాయరు. సీరియస్ విషయాలను సీరి యస్ గా చెబుతూనే తన పాయింట్ దగ్గరికి పాఠకులను బాధ్యతగా నడిపించే రచ యిత. అందువల్లనే ఆయన తెలుగు మార్క్సిస్టు ఆలోచనాపరుల్లో ఒకరిగా నిలబడ్డారు.

రమేష్పట్నాయక్గారు విద్యార్థి ఉద్యమంలో నలిగి, వామపక్ష విప్లవ శిబిరంలో ఎదిగి, మార్క్సిస్టు విశ్లేషకుడిగా గుర్తింపు తెచ్చుకున్నా, ఆయన పేరు విద్యా పరిరక్షణ ఉద్యమంలో ప్రధానంగా వినిపిస్తుంది. ఆ రంగంలో ఆయన విశ్లేషణలకు ఒక రకమైన సాధికారత ఉంది. బహుశా విద్యా పరిరక్షణగానే కాక, విద్యా బోధనా ఉద్యమంగా కూడా రమేష్ పట్నాయక్ గారి ఆలోచనలు, ఆచరణ విస్తరించడం ఆయన వ్యాస రచనా పద్ధతిని ప్రభావితం చేసినట్లు ఉంది.

సమాజాన్ని, కార్యకర్తలను, పాఠకులను విద్యావంతం చేయడం ఒక బోధనా ఉద్యమంగా మారవలసి ఉన్నది. ఈ పని ఎప్పుడూ అవసరమే. ఇప్పుడు మరింత..............................

  • Title :David Harve Pettubadi Edu Pradhamika Vairudhyaalu
  • Author :D Ramesh Patnaik
  • Publisher :Suryachandra Publications
  • ISBN :MANIMN5968
  • Binding :Paerback
  • Published Date :Aug, 2023
  • Number Of Pages :267
  • Language :Telugu
  • Availability :instock