• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Decembrist Khaidi

Decembrist Khaidi By Naga Bhushan

₹ 550

“డిసెంబ్రిష్టు ఖైదీ"

రష్యా చారిత్రక తెలుగు నవల

రచయిత ముందుమాట

ఈ నవల ఒక చారిత్రక నవల. రష్యాలో రెండు శతాబ్దాల కిందట జరిగిన డిసెంబ్రిప్టు విప్లవాన్ని గురించి వివరించే నవల ఇది. రష్యాలో 1917 అక్టోబరు నెలలో జరిగిన విప్లవం విజయం సాధించి, అక్కడ ప్రపంచంలోనే తొలి సోషలిష్టు ప్రభుత్వం ఏర్పడిందని మనకు తెలుసు కదా! అక్టోబరు నెలలో జరగడం వల్లనే ఆ విప్లవానికి అక్టోబరు విప్లవం అనే పేరు వచ్చిందని కూడా మనకు తెలుసు.

అయితే అక్టోబరు విప్లవం కన్నా ముందు రష్యాలో డిసెంబ్రిప్టు విప్లవం, ఆ తర్వాత నరోద్నిక్ విప్లవం పేరుతో మరి రెండు విప్లవాలు జరిగి, ఆ రెండూ విఫలమయ్యాయని మనలో చాలామందికి తెలియదు. వీటిలో డిసెంబ్రిప్టు విప్లవం 1825 డిసెంబరు నెలలో జరగగా, నరోద్నిక్ విప్లవం 1860, 70 దశాబ్దాలలో జరిగింది.

మరి డిసెంబ్రిప్టు విప్లవం డిసెంబరు నెలలో జరగడం వల్ల దీనికీ పేరు వచ్చింది. ఈ విప్లవం రాజరిక రహిత రిపబ్లిక్ కోసం, దున్నేవానికే భూమికోసం, జాతుల వివక్ష రద్దుకోసం, బానిసత్వనిర్మూలన కోసం, అంతస్థుల రద్దుకోసం, సమానత్వ హక్కుకోసం జరిగింది. ఇక నరోద్నిక్ విప్లవం అంటే, నరోద్ అనగా ప్రజలు, నరోద్నిక్కులనగా ప్రజామిత్రులు. ప్రజామిత్రులైన నరోద్నిక్ విప్లవకారులు రైతాంగానికి రాజ్యాధికారం కావాలన్న తలంపుతో ఉద్యమించారు.

పై రెండు విప్లవాలు విఫలమైనప్పటికీ డిసెంబ్రిష్టు విప్లవం - నరోద్నిక్ విప్లవానికి, నరోద్నిక్ విప్లవం - అక్టోబరు విప్లవానికి దారితీశాయి. ఆ రెండు విప్లవాల ప్రభావంతోనే ప్రజల్లో విప్లవ భావాలు నెలకొని, ఆ పై బోల్షివిక్కుల సారథ్యంలో ప్రజలు తిరుగుబాటు జరిపి అక్టోబరు విప్లవాన్ని విజయవంతం చేశారని చెప్పాలి. లెనిన్ కూడా ఈ విషయాన్నే తన రచనల్లో, ప్రసంగాల్లో చెప్పాడు.

అందువల్ల ఈ నవల అటు శ్రామికవర్గ సాహిత్యాభిమానులకు, రష్యన్ సాహిత్యాభిమానులకు తప్పక నచ్చుతుందని చెప్పవచ్చు. అంతమాత్రమేగాక ఈ నవల సామాన్య సాహిత్యాభిమానులకు కూడా తప్పక ఆసక్తిదాయకంగా ఉంటుందని చెప్పాలి.

ఎందుకంటే, మన భారతదేశంలో జరిగిన రెండు స్వాతంత్య్ర పోరాటాల్లోను మొదటి పోరాటం ప్రధానంగా బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగానే తప్ప, ప్రజాస్వామిక హక్కుల......................

  • Title :Decembrist Khaidi
  • Author :Naga Bhushan
  • Publisher :Alochana Prachuranalu
  • ISBN :MANIMN4221
  • Binding :Papar back
  • Published Date :Jan, 2023
  • Number Of Pages :647
  • Language :Telugu
  • Availability :instock