గోదావరి మీద వాకింగ్ స్ట్రీట్
రాజమౌళికి కోటి రూపాయలిచ్చి సినిమా తీయమన్నా
మనుకోండి! మిమ్మల్ని ఎగాదిగా చూసి కత్తిలాంటి ఒక
కొత్త ఆయుధం తయారు చేయించటానికి కూడా ఈ కోటి
సరిపోవూ అంటాడు.
ఆయన ఊహాశక్తికి తగ్గ స్థాయిలో సినిమా తీయాలంటే ఎన్ని కోట్లు కావాలో ఆయనకు కూడా తెలియదు. తన ఊహాశక్తికి తగ్గట్టుగా ఆయన తీస్తూ పోతే, ప్రొడ్యూసర్ కూడా అట్లానే డబ్బులు పెడుతూపోవాలి. చంద్రబాబుగారు కూడా అంతే! తన ఊహాశక్తికి తగ్గ స్థాయిలోనే ఏ పనైనా జరగాలని తపన పడతారు.
అప్పటికింకా అమరావతి శంకుస్థాపన కూడా కాలేదు. రాజమహేంద్రవరంలో అప్పుడెప్పుడో బ్రిటీష్ వాళ్లు కట్టిన హావ్ లాక్ బ్రిడ్జ్ పాత ఇనప సామాను కింద వేలం వేసి అమ్మేయటానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని నా దృష్టికి వచ్చింది. వెంటనే గూగులమ్మనడిగితే హావ్ లాక్ బ్రిడ్జ్ పొడవు మూడు కిలోమీటర్లని, గోదావరి నది మీద అటు కొవ్వూరునీ, ఇటు..............