• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Deepavali Pratyeka Kathalu 2024

Deepavali Pratyeka Kathalu 2024 By Mohammed Khadeer Babu

₹ 245

అదే నవ్వు

సృజన వావిలపల్లి

లంచ్ బెల్ మోగగానే ఇంటికి వెళ్లే తొందర్లో అందరినీ తోసుకుంటూ వెళ్తున్నాను. వడివడిగా మెట్లు దిగుతుంటే ఆ వేగాన్ని ఆపడానికన్నట్టు ఎవరో నా దారికి అడ్డు తగిలారు. సహజంగానే తల దించుకు వెళ్ళే నేను అసహనంగా తల ఎత్తి చూసాను. ఎదురుగా మా సీనియర్. ఎవరో 'ఎటెన్షన్' అని అరిచినట్టు నిటారుగా నిలబడ్డాను. ఆమె రెండు సెకెండ్లు ఏం మాట్లాడకుండా అలాగే నన్ను చూస్తూ వుంది. నేను ఆ ఆమె మొహాన్నేం చూస్తానని అటు ఇటూ దిక్కులు చూస్తున్నాను. ఇంతకీ నన్ను ఎందుకు ఆపినట్టు...!? నాతో ఏం పని? ఇప్పుడు ర్యాగింగ్ ఏమైనా చేస్తారా కొంప తీసి? దానికి నేనే దొరికానా? ఎండ మండిపోతోంది. కడుపు కాలిపోతోంది. వచ్చిన విషయం ఏమిటో చెప్పేస్తే బాగుణ్ణు. చివరికి విష్ చెయ్యడానికి రహస్యంగా గొంతు సవరించుకున్నాను.

ఇంతలో ఆ అమ్మాయి 'స్వాతి క్లాస్లో వుందా?' అని అడిగింది. నాకు ప్రశ్న అర్ధం కావడానికి అర సెకెండ్ పట్టింది. స్వాతీ... ఏ స్వాతి... మా క్లాస్ లో ఇద్దరు స్వాతీలున్నారు అని అడుగుదామనుకున్నాను. వెంటనే ఏ స్వాతి అయినా క్లాస్లో లేదు.... ఇద్దరూ లంచికి వెళ్ళారు అని గుర్తొచ్చి... 'లేదు' అని మాత్రం చెప్పాను. నేనా సమాధానం చెప్పడం ఆలస్యం ఆ పిల్ల పెన్సిల్ హీల్స్ను టకటకా శబ్దం చేసు..................

  • Title :Deepavali Pratyeka Kathalu 2024
  • Author :Mohammed Khadeer Babu
  • Publisher :Writers Meet Publications
  • ISBN :MANIMN5969
  • Binding :Paerback
  • Published Date :2025
  • Number Of Pages :215
  • Language :Telugu
  • Availability :instock