ఒక వియోగగీతం
రమాకాంత్ రథ్
భారతదేశం (ఒడిశా)
అను: అంబటి సురేంద్రరాజు
అవును, ఇక్కడే
ఈ నదీతీరంలోనే
ఇక్కడే ఎక్కడో
ఒక పాట దాగి వుండాలి.
ఈ చీకటిలోయలోనే
ఎక్కడో సూర్యుడు
తలదాచుకుంటాడు.
నీట మునిగిన నౌక
మృత అవయవాలకు
ఇక్కడే ఎక్కడో ప్రాణం పోశారు
నువ్వేమో
నా కౌగిలిలో
ప్రాణం పోసుకుంటావు.
నీ రాకతో జ్ఞాపకాల కుహరంలో
కాంతి ప్రసరిస్తుంది
రోడ్డు మీద చెట్లను
నేనిప్పుడు పేరు పేరునా పిలవగలను
మింట మెరిసే తారకలను
తనివితీరా..................