స్వప్నలోకపు సుదీర్ఘ సంచారి నిరంతర అన్వేషణ
పువ్వులంటే ఎందుకంత ప్రాణం?
బహుశా, గత జన్మలో ఏ ముద్దమందారంలానో పుట్టి తన అరుణారుణ కాంతులతో ఈ లోకాన్ని వెలిగించిందేమో!
పువ్వులంటే ఎందుకంత పరవశం?
బహుశా, గత జన్మలో ఏ సంపంగి పువ్వులానో పుట్టి తన పరిమళంతో ఈ లోకాన్ని సౌందర్యభరితం చేసిందేమో?
పువ్వులంటే ఎందుకంత పావురం?
బహుశా, గత జన్మలో ఏ పన్నెండేళ్లకోసారి పూచే ఏ నీలికురంజి పువ్వులానో పుట్టి ఈ లోకాన్ని అబ్బురంగా వీక్షించిందేమో?
లేకపోతే ఇన్ని పువ్వులు, ఇన్ని నవ్వులు, ఇంత పొగమంచు, ఇంత సూర్య రశ్మి, ఇంత ప్రేమ, ఇంత మోహం, ఇంత ధ్యానం, ఇన్ని చినుకుపూల రెక్కలు, నీహారికా బిందు సందోహాల అచుంబిత సౌందర్యాభినివేశపు తళుకు బెళుకులు, ఇన్ని ధాన్యంపు పూరాశుల సంగీత సరిగమలు అలవోకగా ఈ కవిత్వం ఎలా కనిపిస్తాయి? ఎలా వినిపిస్తాయి?
మంచు మేసే గుమ్మడిపువ్వుల నుండి ఆవ పూల చేలలో ఒంటరిగా కూర్చునే అమ్మాయిల దాకా, పొగమంచు పువ్వుల మేల్కొలుపు నుండి నిద్ర లేని కనురెప్పల............