ప్రణతులు
గురువు గారి దగ్గర మంత్రం చెప్పుకున్న తరువాత ఆ మంత్రాన్ని జపం చెయ్యాలి. జపం అంటే ఉదయం ఒక మాల, సాయంత్రం ఒక మాల కాదు. ఇలా చేస్తే "మనం కూడా మంత్రజపం చేస్తున్నాము" అని చెప్పుకోటానికి సరిపోతుంది. అంతకు మించిన ఫలితం ఉండదు. మంత్రం చెప్పుకున్న తరువాత కనీసం ఒక లక్ష జపమైనా చెయ్యాలి. అదికూడా మంత్రసిద్ధికి చాలదు. మంత్రం సిద్ధించాలంటే కనీసం అక్షరలక్షలు జపం చెయ్యాలి. మంత్రంలో ఎన్ని అక్షరాలున్నాయో అన్ని లక్షలు జపం చెయ్యాలి. అప్పుడు మంత్రసిద్ది జరగవచ్చు. మంత్రం చెప్పుకున్న వారందరికీ ఒకే | సంఖ్య జపం సరిపోదు. కొందరికి మంత్రం చెప్పుకోగానే దేవతాదర్శన మవుతుంది. అది వారి పూర్వజన్మసుకృతం. మరికొందరికి ఎంత సంఖ్య | జపం చేసినా, ఎంత కాలం గడిచినా మంత్రం సిద్ధించదు. అది వారు గతజన్మలో చేసుకున్న దుష్కర్మ. కొంతమందికి మంత్రజపం చెయ్యగా చెయ్యగా మంత్రం సిద్ధిస్తుంది. ఇదంతా వారి గతజన్మ కర్మఫలము, మంత్రసిద్ధి జపం చేసే విధానము, దేవత మీద ఉన్న భక్తి, గురువు అనుగ్రహము మన శ్రద్ధ మొదలైన వాటి మీద ఆధారపడి ఉంటుంది. శ్రీరామచంద్రుడికి అగస్త్యుడు | ఆదిత్య హృదయం చెప్పగానే ఆదిత్యుడు దర్శనమిచ్చాడు. రాముడు సాక్షాత్తు | అవతార పురుషుడు కాబట్టి అలా జరిగింది. అందరికీ అలాజరగదు. మంత్రసిద్ది కావాలంటే, పురశ్చరణ చెయ్యాలి. ఎంత కాలం చెయ్యాలి అంటే, మంత్రం సిద్ధించేదాకా చెయ్యాలి.
మంత్రసిద్ధి కావాలంటే కేవలము జపమే కాకుండా దేవతకు సంబంధించిన హృదయము, కవచము, స్తోత్రాలు, అపోతరము, సహస్రము | వంటి వాటితో పాటుగా రుద్రం కూడా పారాయణ చెయ్యాలి. శ్రీవిద్యోపాసకులు బైరవ మంత్రం కాని, రుద్రాభిషేకం గాని ప్రతినిత్యం చేస్తేనే మంత్రసిద్ధి త్వరగా జరుగుతుంది. వీటితో పాటుగా తర్పణ, అర్చన కూడా చెయ్యాలి. అర్చన అంటే, ఆ దేవతకు నిర్దేశించిన యంత్రంలో వివిధ ఆవరణలు, ఆవరణలలో వివిధ దేవతలు ఉంటారు. ప్రతినిత్యం వారందరినీ అర్చించాలి. అదే యంత్రపూజ అంటారు. ఇక తర్పణలంటే మంత్రంలోని..............