• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Devudi Mora

Devudi Mora By Akurati Bhaskar Chandra

₹ 150

మార్కండేయులు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు.

తన రూంలో వెలుగుతున్న బెడ్ ల్యాంప్ మిణుకుమిణుకుమంటూ కొట్టుకుంటోంది. దాన్ని చూసి విసుక్కున్నాడు. "ఈ దిక్కుమాలిన లైట్ ఎన్నిసార్లు మార్చినా ఇలాగే తగలడుతుంది" అనుకున్నాడు. స్విచ్ తీసేద్దామనుకున్నాడు గానీ అది లేకపోతే గదినిండా చీకటి నిండిపోతుంది. చీకటంటే మార్కండేయులికి చిరాకు. చాలామంది చీకటంటే భయపడతారు. అతనికి భయం వుండదు కానీ చిరాకు. కొడుకు విశ్వం ఎలక్ట్రిషియన్ కోసం కబురు పెడతానని చెబుతాడుగానీ వీడు చెప్పడో వాడు రాదో తేలని చిక్కు ప్రశ్న. అది గత నెలరోజులుగా అలాగే వేలాడుతుంది. మార్కండేయులికి ఆ బల్బ్ మీద ఉన్నట్టుండి జాలి కలిగింది. ఎందుకో అది తన జీవితాన్ని ప్రతిబింబిస్తున్నట్టుగా అనిపించింది. వెలగలేక ఆరలేక వేలాడుతున్న యీ బల్బుకీ తనకీ ఎందులో వుంది వ్యత్యాసం? తనూ అంతే! పైకి పోలేక యిక్కడ బ్రతకలేక వేలాట్టం లేదూ? నిర్వేదంతో డెబ్బయ్ అయిదేళ్ల వయసును మోస్తూ, అందరి కోపాలను, చిరాకులనూ, చీదరింపులనూ భరిస్తూ యీ జీవితాన్ని లాగించడం లేదూ? అదీ అలాగే వుంది.

మంచం మీద నుంచి పైకి లేచి పక్కనే వుంచుకున్న వాటర్ బాటిల్ నుంచి మంచి నీళ్లు తాగాడు. ఇంతలో అతని మొబైల్ మోగటం వినిపించింది. మనవడో మనవరాలో మళ్లీ కాలర్ ట్యూన్ మార్చినట్టున్నారు. కొత్తగా వుంది. పాత రకం మొబైల్ వాడుతున్నందుకు వాళ్లు ఆటపట్టిస్తూ వుంటారు. మార్కండేయులు బాగా..................

  • Title :Devudi Mora
  • Author :Akurati Bhaskar Chandra
  • Publisher :Anvikshiki Publishers
  • ISBN :MANIMN5854
  • Binding :Papar Back
  • Published Date :2024
  • Number Of Pages :105
  • Language :Telugu
  • Availability :instock