జీవితము - సాధన
20వ శతాబ్దపు రెండవ దశకం, ఆధునిక కన్నడ సాహిత్యం ప్రాముఖ్యతను సంతరించుకొన్న కాలము. అప్పటికే భారత దేశపు సామాజిక జీవితంలో అనేకానేక మార్పులు చోటు చేసుకున్నాయి. పాశ్చాత్య సాహిత్య ప్రభావానికి కన్నడం ప్రగాఢంగా గురి అయింది. సాహిత్యంలో కొత్త కొత్త రీతులు పురుడు పోసుకున్నాయి. సంప్రదాయబద్ధమైన మార్గాలను వదలి సరికొత్త రీతుల పట్ల - పరిశోధన రూపంలో మార్పు, అభివ్యక్తి - రచయితలు ఆసక్తి కనపరచసాగారు. కొత్త అభివ్యక్తి తప్పనిసరి. కావడంతో నవలాప్రక్రియ ఊపందుకుంది. తన స్వరూపపు కొత్తదనం కారణంగా నవలా ప్రక్రియ ముందంజవేయ సాగింది. పాశ్చాత్య సాహిత్యంతో పరిచయం ఏర్పడంవల్ల నవల కన్నడ సాహిత్యంలో ప్రవేశించింది. పాశ్చాత్య సాహిత్యపు ప్రభావంతో పాటు ప్రాచీన కన్నడ మహా కావ్యాల కథనా శైలిని కూడా కన్నడ నవల జీర్ణించుకుంది. తొలిదశలో బెంగాలీ, మరాఠీ నవలలు కన్నడంలో అనువదించబడ్డాయి. ఆ విధంగా నవలల పట్ల పాఠకులలో ఆసక్తి పెంపొంద సాగింది. కన్నడపు తొలి నవలాకారుల ఉద్దేశ్యం కొత్త ప్రక్రియను ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టడంగా ఉండేది. తొలిదశ నవలాకారులు నవలను చదివే పాఠకులను తయారు చేసే ప్రయత్నం కూడా చేసారు. ఒక దశలో నవలా రచయితల సంఖ్య తక్కువుగా ఉండేది. కాని చదువరుల సంఖ్యను, అసంఖ్యాకంగా, నవలలు పెంచాయి. ఆ తరువాతి రచయితలు పాఠకుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని సరికొత్త ప్రయోగాలు చేయసాగారు. అటువంటి చెప్పుకోదగ్గ రచయితలలో దేవుడు ఒకడు.
దేవుడు (దేవుడు నరసింహ శాస్త్రి: 1896-1962) నవీన (హొస) కన్నడ సాహిత్యపు ప్రతిభావంతుల తరానికి చెందిన రచయితలలో ఒకడు. అంతేకాదు,.........