• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Devulapalli Krishna Sastri

Devulapalli Krishna Sastri By Bhusurapalli Venkateswarlu

₹ 50

నాదొక మాట

కేంద్రసాహిత్య అకాదెమీవారు దేవులపల్లి కృష్ణశాస్త్రి మోనోగ్రాఫ్ తయారు చేయడానికి పూనుకోవడం ముదావహం. నాకు ఆ మహనీయుని చరిత్రను పరిచయం చేసే అవకాశం రావడం అదృష్టం.

తెలుగుభాషలో భావకవితా ప్రపంచానికి అధినేత కృష్ణశాస్త్రి. భావకవిగా పుట్టి, భావకవిగా పెరిగి, భావగీతాలాలపించి, భావకవిత్వాన్ని ఉద్యమంగా స్వీకరించి విశేష ప్రచారం చేసి, రెండు దశాబ్దాల కాలం ఎదురులేని తన కవితాలహరిలో తెలుగు పాఠకులను ముంచి తేల్చి అచ్చమైన భావకవిగా గంధర్వ లోకాలకేగిన గానమూర్తి కృష్ణశాస్త్రి.

ఆధునిక సాహిత్య ప్రపంచంలోకి అడుగుపెట్టిన చాలా ప్రక్రియలు స్పృశించినా, అన్నిట్లోను స్వచ్ఛమైన భావకవిగానే జీవించారు. పద్య కవిత్వాన్ని పండించారు. పాటల కవిగా పేరు పొందారు. నాటకాలు, యక్షగానాలు చేశారు. ఎన్నో వ్యాసాలు వెలయించి వచనంలో కూడ సాహిత్య సౌరభాలు విరజిమ్మారు. అటు సంప్రదాయవాదులు ఆయన్ని కాదనలేకపోయారు. ఇటు అభ్యుదయవాదులు ఆయన్ని అభిమానించారు. ఒక్కమాటలో ఆయన పాతక్రొత్తల మేలు కలయిక.

తండ్రి నుంచి సంక్రమించిన సంగీత పరిచయంతోను, గురువుల నుంచి సంక్రమించిన సాహిత్య వాసనలతోను, ఉభయప్రధానమైన భావ కవిత్వంలోని లోతుల కోసం అన్వేషిస్తున్న రోజుల్లో కేంద్రసాహిత్య అకాదెమీ వారు నాకు కృష్ణశాస్త్రిగారి జీవిత రచనకు అవకాశం కల్పించడం సమయమెరిగి చేసిన మంచిపనిగా భావించి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రసహృదయాన్ని పారంపర్యంగా అందించిన తల్లిదండ్రులు శ్రీ భూసురపల్లి ఆదిశేషయ్య, శ్రీమతి సుబ్బరత్నమ్మగార్లకు, రసలోకాన్ని చూపించి దగ్గరకు చేర్చిన గురువులు శ్రీ నాగభైరవ కోటేశ్వరరావుగారికి నమస్సులర్పిస్తున్నాను.

ఈ రచనలో కృష్ణశాస్త్రిగారి జీవన సౌందర్యాన్ని, సాహిత్య సౌందర్యాన్ని సమంగా అందించడానికి ప్రయత్నించాను. సామాన్య శ్రోతకు కొద్దిగా దూరమైనా, భావకవిత్వయుగంలో బాగా చోటుచేసుకున్న కొన్ని పదాలు వాడక తప్పదుకదా! సహృదయులు నా ప్రయత్నాన్ని ఆశీర్వదించ వలసినదిగా కోరుతూ, కేంద్రసాహిత్య అకాదెమీ వారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ, పాఠకుల్ని కృష్ణశాస్త్రిని చూడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను.................

  • Title :Devulapalli Krishna Sastri
  • Author :Bhusurapalli Venkateswarlu
  • Publisher :Sahitya Acadamy
  • ISBN :MANIMN4705
  • Binding :Papar Back
  • Published Date :2017 3rd print
  • Number Of Pages :77
  • Language :Telugu
  • Availability :instock