₹ 79
సుప్రసిద్ధ మేధావి, కారల్ మర్క్స్ కు సన్నిహిత మిత్రుడు అయిన హెడరిక్ ఎంగెల్స్ ఒక గ్రంథంలో ఇలా రాశారు. " సమాజ చరిత్ర ఒక దశ నుంచి మరో దశకు మార్పు చెందే సంధి ఈ దశలో అప్పుడప్పుడు నూతన మతాలు తలెత్తాయి. క్రైస్తవం, బౌద్ధం, ఇస్లాం, మతాలకు ఈ సూత్రం వర్తిస్తుంది". అయితే ఈ సూత్రం బౌద్దానికి మరింత స్పష్టంగా నిర్ద్వంధ్వంగా వర్తిస్తుంది. మతాల ఆవిర్భావానికే కాదు దాదపు అన్ని ముఖ్యమైన పరిణామాలకు కొన్ని చారిత్రక కారణాలు ప్రేరకంగా పనిచేస్తాయి. బౌద్దాన్ని మనం ఒక మతంగా తీసుకున్నా, ఒక ప్రగతిశీల సామజిక ఉద్యమంగా స్వీకరించినా, ప్రజలను బ్రహ్మాండంగా ప్రభావితం చేసే ఒక శక్తిగా పరిగణించినా బౌద్ధం ఆవిర్భవించడానికి నాలుగు ముఖ్య చారిత్రక కారణాలు మనకు కనిపిస్తాయి. ఇది శూన్యాంలోంచి పుట్టుకొచ్చిన మతం కానీ ఉద్యమం కానీ కాదు. దీని పుట్టుకకు నాలుగు బలమైన కారణాలున్న మాల అక్షర సత్యం. రాజ్యహింస, యాగహింస, వర్ణవ్యవస్థ, బ్రాహ్మణ్యం.
- Title :Dhamma Paddam
- Author :Sodum Ramohan
- Publisher :Bandla Publications
- ISBN :MANIMN2002
- Binding :Paerback
- Published Date :2010
- Number Of Pages :192
- Language :Telugu
- Availability :instock