₹ 90
ఒక పెద్ద దివాణం లాంటి పెంకుటిళ్ళు. దానిముందు పెద్ద చెక్కగేటు: గేటు తియ్యాలంటే గుండె ధైర్యం ఉండాలి. ఇంటిలోపల నాలుగు బలమైన జాతికుక్కలు! పగలైతే గొలుసులతో కట్టి ఉంచుతారు.... రాత్రుళ్ళు టార్చి లైట్లు లాంటి జిగేల్ మనే కళ్ళతో హ్రాహారి గోడలోపల తిరుగుతూ ఉంటాయి!..... తెలిసిన వారయినా, తెలియని వారయినా బయట పిలుపు గంట మౌగించి కొంచెంసేపు ఆగి లోపలి వెళ్ళాల్సి ఉంటుంది! గంట మౌగించకుండా లోపలికి వెళ్ళారా, వాళ్ళు ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే.
వెంకటస్వామి ఇంటిని ఉదయాన్నే చూడాలి. తూర్పు గుమ్మం కాబట్టి "సూర్యుడు వంగి, వెంకటస్వామి ఇంట్లోకే చూస్తున్నాడా!" అన్నట్టు ఉంటుంది. గోడమీద నెమళ్ళు, ప్రహరీ లోపల కోళ్ళు,పావురాలు,గిన్నెకోళ్ళు, టర్కీ కోళ్ళు, మధ్య మధ్యలో లేగదూడలు చెంగు, చెంగున గెంతుతూ "అంబా" అని అరుస్తుంటాయి.
- Title :Dhanassu
- Author :Dugginapalli Ejrasastry
- Publisher :Malletega Publications
- ISBN :MANIMN0897
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :60
- Language :Telugu
- Availability :instock