ఆకాశం లాంటి నీ మనసులో
నీకు పరిచయం అయిన ప్రతీ ఒక్కరూ వచ్చిపోయే మేఘాల్లాంటి వాళ్ళే.
కొందరు చిరుజల్లుని కురిపించి నిన్ను మురిపిస్తే, మరికొందరు పిడుగులతో
నీ జీవితాన్ని అల్లకల్లోలం చేస్తారు.
జల్లుల ప్రేమలో తడిసి ముద్దయినా,
పిడుగులకి జడిసినా కొంతసేపే... కొన్నాళ్లే...
తన పని అయిపోగానే, మేఘాలు వేరే చోటికి వెళ్లిపోతాయి.
ఎక్కడో ఎప్పుడో ఒక మేఘం మాత్రం
నీతోనే ఒక జ్ఞాపకంగా, జీవితంగా
నీతోనే ఉండిపోవచ్చు.
అప్పటివరకూ ఆ ఆకాశం,
నీ మనసు మాత్రం శాశ్వతం, నిశ్చలం!"..................................