తొలిపలుకులు
నాకు తెలుగులో నాకు తెలుగులో నాకు తెలుగులో నాకు తెలుగులో అంత పాండిత్యం లేదు. సంస్కృత భాష తెలియదు. వేదం గురించి అసలు ఏమీ తెలియదు. ఆంగ్ల చదువులు చదివాను. ఆంగ్లభాషకు సంబంధించి హైద్రాబాద్లో గల EFLU (CIEFL) లో Phonetics and Spoken English లో పరిశోధన చేసి ఆంగ్లభాషపట్లే మోజు పెంచుకున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కళాశాలల్లో ఆంగ్ల అధ్యాపకురాలిగా చేసిన విశ్రాంత ఉద్యోగినిని. చిన్నప్పటినుండి తెలుగులో అనేక పుస్తకాలు చదవడంవల్ల తెలుగు సాహిత్యమంటే కొంత అవగాహన ఉంది. ఈ మధ్య మన ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడంవల్ల వాటిగురించి ఆసక్తి కలిగింది. మన సంస్కృతీ సంప్రదాయాల గురించి తెలుసుకోవాలంటే పురాణాలే సరి అని అవి చదవడం
మొదలుపెట్టాను. ఈ క్రమంలో కోట వెంకటాచలంగారి పుస్తకాలు 'బ్రహ్మాండ సృష్టి విజ్ఞానం, మానవసృష్టి విజ్ఞానం, కలిశక విజ్ఞానం' చదివాక మన సంస్కృతి యొక్క గొప్పదనం తెలియసాగింది. పురాణాలు ఎంతో పురాతనమైన పూర్వయుగాల చరిత్రను గురించి చెప్తాయి. అవి చదువుతుంటే అద్భుతం అనిపించాయి, ఎంతో ఆనందం గూడా వేయసాగింది. ఆంగ్లభాషలో అనేక పుస్తకాలు చదివాను. కానీ మన ఆధ్యాత్మిక సాహిత్యం చదివినప్పుడు కలిగిన ఆనందం ఆంగ్ల సాహిత్యం చదివినప్పుడు కలగలేదు. అసలు ఇలాంటి పురాణసంపద ఒక్క భారతదేశానికి చెందిన వేదధర్మంలోనే ఉండడం మనఅదృష్టం. వాటి ద్వారానే మనకు పరమాత్మతత్త్వం, బ్రహ్మాండం యొక్క సృష్టి గురించిన రహస్యాలు తెలిసాయి. అసలు సత్యమంటే ఏమిటోనన్నది ఆంగ్ల సాహిత్యంలో ఎక్కడాలేదు. మనకుమాత్రమే ఉంది. మన ఆధ్యాత్మిక సాహిత్యంలో ఏ సమస్యకైనా పరిష్కారం దైవచింతనే అని చెబుతుంది. అది చాలు కష్టాల్లో వున్నవారి మనసుకు ఊరట కలిగించడానికి,
మనపురాణాల్లో దివ్యశక్తులుకలవారు ఎక్కువగా కనిపిస్తారు. ఇప్పుడుగూడా మహిమలు కలవారు మనకు కనిపిస్తూంటారు కొందరు సిద్ధుల, యోగులరూపంలో, ఐనా వారిని మనం నమ్మం. కొందరు నమ్మి...............