₹ 200
1980 - దశకాల నుండి నాకు శ్రీకాట్రగడ్డ లక్ష్మీనరసింహారావు గారితో అనుభందం ఉంది. నేను 2007 లో అమెరికా సంయుక్త రాష్ట్రాలలో పర్యటిస్తూ డెట్రాయిట్ వెళ్ళాను. డెట్రాయుటలో కాట్రగడ్డ కృష్ణప్రసాద్ గారి ఇంట్లో నాకు బస. అప్పుడప్పుడు వారి ఇంటికి అత్యంత సమీపంలో ఉన్న కృష్ణ ప్రసాద్ గారి బావగారు, అప్పటి తానా ప్రెసిడెంట్ ఐన బండ్ల హనుమయ్య గారి ఇంటికి కూడా వెళ్ళి సాహిత్య చర్చ సాగించడం జరిగేది. కృష్ణప్రసాద్ గారి ఇంట్లో భగవద్గితపైనా, హనుమయ్య గారి ఇంట్లో భారత భగవతాదులు, ఇతర ప్రబంధాలు, జాషువా వంటి నవయుగ కవుల పై రసవత్తర చర్చలు జరుగుతూ ఉండేవి. డెట్రాయిట్ తెలుగు వారైన వడ్లమూడి బాబు, నవులూరి సోమేశ్వరరావు, నాదెండ్ల గంగాధర్, లింగ సాయికుమార్, యార్లగడ్డ కృష్ణప్రసాద్ ప్రభృతులంతా ఈ చర్చల్లో పాల్గొనేవారు. ఈ చర్చా గోషులన్నింటికీ దగ్గర నుండి పర్యవేక్షించి, నాకు మార్గదర్శకులై నిలిచిన పెద్దలు శ్రీ కాట్రగడ్డ లక్ష్మీనరసింహరావుగారు, వీరి ధర్మపత్ని కమలాదేవి గారు.విరు కాట్రగడ్డ కృష్ణప్రసాద్ గారి తల్లి దండ్రులు. బండ్ల హనుమయ్య గారి అత్తమామలు కూడా.
-డా || మేడసాని మోహన్.
- Title :Dhyana Sarassu
- Author :Dr Medasani Mohan
- Publisher :Navalakshmi Publications
- ISBN :MANIMN0732
- Binding :Paperback
- Published Date :2012
- Number Of Pages :166
- Language :Telugu
- Availability :instock