• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Diler

Diler By Shayari

₹ 150

సాహస కవిత

= డా. జిలుకర శ్రీనివాస్

గత పాతికేళ్లుగా స్కైబాబ ప్రమేయం లేకుండా తెలుగు సాహిత్యం లేదు. సాహిత్య ఆవరణలో తన ఉనికి, జోక్యం, ప్రమేయాల ప్రభావం ఎవరూ విస్మరించ లేనిది. రచన, ఆచరణ రెండూ విడదీయలేని సాహిత్య వ్యక్తిత్వం తనది. సమానత్వం, సోదరభావం, స్వేచ్ఛ, సహనంల వ్యక్తీకరణ అతడి కవిత్వం. 'దిలేర్' సంకలనంతో స్కైబాబ మరొక అదనపు విలువను సాహిత్య క్షేత్రానికి అందిస్తున్నాడు.

కవిత్వానికి, తత్వశాస్త్రానికి చాలా తేడాలున్నాయి. వాటిలో ఒకటి భావోద్వేగాల ప్రకటన. ప్రకృతి, మనిషి, సమాజం మధ్య వుండే సంబంధాలు, వాటి గుణధర్మాలను, చలనాలను తత్వశాస్త్రం విశ్లేషిస్తుంది. కవిత్వం ఆ గుణధర్మాలను, చలనాలను భావావేశంతో ఉద్వేగభరితంగా వ్యక్తం చేస్తుంది. భావోద్వేగాల వ్యక్తిగతమనేది ఒక అపోహ. భావోద్వేగాలు కేవలం జైవికమైనవి అనే ఆలోచనకు పెద్ద ఆమోదమేమీ లేదు. సమాజంలోని విలువలు, ఆధిపత్యం నెరిపే నిర్మాణాలు, ఆ చట్రంతో పెనుగులాడే వ్యక్తి అనుభవించే మానసిక సంఘర్షణలు ఇంకా అనే ఫినామినలాజికల్, ఆంటలాజికల్ అంశాలన్నీ భావోద్వేగాలను నిర్మిస్తాయి. విషాదమే లేని సమాజాన్ని కోరుకొనే కవికి భావోద్వేగాలు కవితా పరికరాలుగా ఉపయోగ పడుతాయి.

దిలేర్ కవితా సంకలనంలో మానవ సంవేదన, ప్రాదేశిక చైతన్యం, సంఘ్ నాజీయిజ వ్యతిరేకత స్పష్టం అవుతాయి. ప్రేమను అంగీకరించలేని వాళ్లు స్వేచ్ఛా సమాజాన్ని నిర్మించలేరు. స్వేచ్ఛ లేని చోట సమానత్వం వుండదు. సమానత్వం లేని చోట సోదరభావం వుండదు. సోదరభావంలేని చోట ప్రజాస్వామ్యం వర్ధిల్లదు. స్కైబాబ ప్రేమపూరిత సమాజాన్ని కోరుతున్నాడు. మనుషుల మధ్య అధికార.................

  • Title :Diler
  • Author :Shayari
  • Publisher :"Nasal" Kitab Ghar
  • ISBN :MANIMN4644
  • Binding :Papar back
  • Published Date :Dec, 2022
  • Number Of Pages :175
  • Language :Telugu
  • Availability :instock