డాగ్ వార్
నాంది
పశ్చిమంలో సూర్యుడు మెల్లగా క్రుంగిపోతున్నాడు. ఎర్రని కాంతులతో ఆకాశమంతా రాగరంజితమవుతోంది. అక్కడక్కడ మేఘాల తరకలు తేలికగా కదులుతున్నాయ్.
సంజచీకటి అలవోకగా లోకాన్ని కప్పివేయడం ప్రారంభించింది. మారుతున్న వాతావరణం మనిషిలోని మార్పుకి సంకేతంలా వుంది.
సీట్ బెల్ట్ బిగించుకుని విండో గ్లాస్గోలో నుంచి క్రిందకు చూసింది మాళవిక. నగరంలోని కరెంట్ దీపాలు మిణుకు మిణుకుమంటున్నాయి చుక్కల్లా. కదులుతున్న విమానంలోంచి కన్పించిన క్షణమే మాయమవుతున్నాయవి.
చేతికి వున్న వాచి కేసి చూసుకుందామె. సాయంత్రం ఆరుగంటలవుతోంది. శీతాకాలం కావడంతో భాగ్యనగరంలో చీకటి చాలా వేగంగా ముసురుకుంటోంది. మాళవిక తల తిప్పి కాబిన్ అంతా పరిశీలించి చూసింది.
ఇండియన్ ఎయిర్లైన్స్క చెందిన బోయింగ్ విమానం అది! ఢిల్లీ-హైదరాబాద్లో మధ్య ప్రయాణించే ఆ బోయింగ్ కాబిన్ అంతా ప్రయాణీకులతో నిండి వుంది. లాండింగ్ ఎనౌన్స్మెంట్ అయిన తరువాత ఈజిల్ లైట్లు, కాకి పిట్ లాండింగ్ సిగ్నల్ లైట్ తప్ప కాబిన్ మరే లైట్ వెలగడం లేదు
ఎర్రగా మెరుస్తున్న 'నో స్మోకింగ్' సిగ్నల్ తాలూకూ అక్షరాలను చూస్తూ ఆలోచనలో
పడిపోయింది మాళవిక.
రెండురోజుల క్రితమే సెలవులు పూర్తికావడంతో టోక్యో వెళ్ళింది తను. అక్కడ టోక్యో యూనివర్శిటీలో చదువుకుంటోంది మాళవిక...................