• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Doora Theeralu

Doora Theeralu By Challa Jaypal Reddy

₹ 200

దూర తీరాలు

ఉదయం తొమ్మిది గంటలు ఉస్మానియా యూనివర్సిటీ పి.జి. ఎంట్రెన్స్ అప్లికేషన్స్ ఇచ్చేందుకు వచ్చిన విద్యార్థినీ, విద్యార్థులతో కళకళలాడుతోంది. పచ్చని చెట్లతో క్యాంపస్ అంతా ఆహ్లాదంగా ఉంది. అక్కడక్కడ పోలీసులున్నారు. పరిసరాలను, విద్యార్థులను పరికిస్తూ ఆర్ట్స్ కళాశాల భవనం ముందుకు చేరుకున్నాను. భవనం మొత్తం రాళ్ళతో నిర్మించారు. చెక్కతో చేసిన పెద్ద పెద్ద తలుపులున్న ద్వారం గూండా మెల్లగా భవనం లోపలికి అడుగుపెట్టాను. అద్భుతంగా వుంది భవనం. ఏదో తెలియని వింత అనుభూతికి లోనయ్యాను.

ఈ కాలేజీలో సీటొస్తుందా?! వస్తే ఎంత బాగుండును. ఈ కాలేజీలో చదవటం నిజంగా ఎంత అదృష్టం. విశాలమైన కారిడార్లలో విద్యార్థులు గుంపులు, గుంపులుగా తిరుగుతూ అప్లికేషన్స్ యిస్తున్నారు. భవన నిర్మాణాన్ని, విద్యార్థులను పరిశీలిస్తూ నేను కూడా అప్లికేషన్స్ యిచ్చేశాను.

అప్లికేషన్స్ యిచ్చి బయటకి వస్తూండగా ప్రవేశద్వారం వద్ద కొందరు విద్యార్థులు పోస్టర్ అందిస్తున్నారు. ఏమిటా అని చూడ్డానికి అక్కడే నిలబడ్డాను. ఆ పోస్టర్లో "ఉపేందర్పై హత్యాయత్నంతో సంబంధంలేదు" అన్న శీర్షిక వుంది. దీనికి కొంచెం పక్కగా మరో బోర్డపై “ఉపేందర్ప హత్యాయత్నాన్ని ఖండించండి" అనే పోస్టర్ వుంది.

 

ఉపేందర్ అనే సైన్సు కళాశాల విద్యార్థి ఒకరు కత్తిపోట్లకు గురై ఆస్పత్రిలో చావు బ్రతుకుల్లో ఉన్నట్లు, దీనికి కారణం ఫలానా గ్రూపు విద్యార్థులని పోస్టర్ సారాంశం. అయితే ఉపేందర్పై హత్యాయత్నంతో తమకెలాంటి సంబంధం లేదని, ఉపేందర్ గ్రూపులోని విద్యార్థులే కొందరు ఈ చర్యకు పాల్పడి దానిని తమపైకి నెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని మరోపోస్టర్లో ఖండన, విద్యార్థుల మధ్య ఘర్షణ జరుగుతుందనే కావచ్చు క్యాంపస్ లో పోలీసులున్నారు.

తిన్నగా అక్కడి నుండి పక్కనే వున్న బస్టాప్కు వచ్చాను. బస్టాప్కు మరో వైపు సైన్సు కళాశాల భవనాలున్నాయి. టీ తాగాలనిపించి క్యాంటీన్ ఎటువైపని ఓ స్టూడెంటడిగాను. చూపించాడు. క్యాంటీన్లోకి వెళుతుంటే అక్కడ కూడా అవే పోస్టర్లు దర్శనమిచ్చాయి. క్యాంటీన్ చాలా విశాలంగా వుంది. ఒక్క సీటు కూడా ఖాళీ లేదు. చాలామంది నిలబడే టీ తాగుతున్నారు. నేను కూడా నిలబడే టీ తాగి బయటపడ్డాను. హైదరాబాద్కు వచ్చిన పని అయిపోయింది. తిరిగి ఊరికి వెళ్ళిపోవటమే. గౌలిగూడ బస్టేషన్కు బయలుదేరాను..................

  • Title :Doora Theeralu
  • Author :Challa Jaypal Reddy
  • Publisher :Challa Jaypal Reddy
  • ISBN :MANIMN4419
  • Binding :Papar back
  • Published Date :Jan, 2023
  • Number Of Pages :131
  • Language :Telugu
  • Availability :instock