ఆవిష్కృతమైన పాతికేళ్ళనాటి సమాజం
మనిషి మనుగడలో మానవ సంబంధాలకున్న ప్రాముఖ్యత దేనికీ లేదేమో! ప్రేమ, అవగాహన, గౌరవం అనే పునాదుల మీద ఏర్పడే ఈ సంబంధాలు సమాజంలోని వ్యక్తుల మధ్య ఒక బంధాన్ని, జీవితం పట్ల ఒక మమకారాన్ని కలిగిస్తాయి. సమాజాన్ని నడిపించే స్త్రీ పురుషుల మధ్య సంబంధాలు ఎలా ఉండాలనేది కాలానుగుణంగా సమాజమే నిర్ణయిస్తూ వస్తుంది. వాటిని నిర్లక్ష్యం చేసినపుడు జీవితాలు అల్లకల్లోలమవుతాయి. వ్యక్తుల మధ్య సంబంధాల్లో పరస్పరం బాధ్యతను గుర్తెరగవలసిన అవసరం ఉంది.
శ్రీమతి దాసరి శిరీషగారు రాసిన 'దూరతీరాలు' నవల దాదాపు పాతికేళ్ల క్రితం ఆంధ్రప్రభ వారపత్రికలో సీరియల్గా వచ్చి, అనేక మంది పాఠకుల ఆదరణ పొందింది. ఒక వివాహితుడికి, ఒక అవివాహితతో ఏర్పడిన సంబంధం ఏ విధంగా వారి జీవితాల్లో కల్లోలాన్ని సృష్టించిందో ఈ నవల చెబుతుంది. కథలోకి వెళ్తే....
పాతికేళ్లనాటి సమాజాన్ని ఈ నవలలో సహజంగా, అందంగా ఆవిష్కరించారు రచయిత్రి. నవల చదువుతుంటే ఆ కాలంలోకి వెళ్లిపోతాము. చదువుకుని, ఆర్థికంగా స్వతంత్రంగా నిలబడిన స్త్రీలను ఈ నవలలో చూస్తాం. విద్యావంతులైన కొందరు దంపతులు మిగిలిన వారికంటే భిన్నంగా స్నేహితులు, సరదాలు మధ్య స్వతంత్రమైన ఆలోచనలతో, విశాల దృక్పథంతో ఆదర్శవంతంగా జీవించటం కనిపిస్తుంది. అలాటి ఒక జంట కథే ఇది....................