• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Dostoevsky Idiot

Dostoevsky Idiot By Y Venugopal Reddy

₹ 500

చొస్తాయేవిస్కీ నవల - ది ఇడియట్ - పాఠకుడి నోట్సు

చదువరులకు ఆహ్వానం. ప్రపంచ ప్రసిద్ధ నవలల్లో ఒకటిగా గుర్తింపు పొందిన 'ఇడియట్' నవల తొలి తెలుగు అనువాదం మీ చేతుల్లో వుంది. ఎంత ప్రఖ్యాతి గడించిందో అంత వివాదాస్పదమూ, విమర్శనాత్మకమూ అయిన ఈ నవలలో చిత్రించినది దొస్తాయేపీ స్కీ

జీవితమేనని చెబుతారు.

వివరాలలోకి వెళ్లే ముందు తెలుగు అనువాదాల పట్ల అత్యంత ఆసక్తి కలిగించిన అనువాదకులకు కృతజ్ఞతలు తెలియజేయడం నా ధర్మం అనుకొని ఈ కొన్ని మాటలు. ఇవి సార్వజనీనమైన అనుభవాలని నా నమ్మకం కూడా.

పెద్ద ప్రపంచంలో చిన్న పిల్లడు

నేను చదివిన తొలి తెలుగు అనువాదం క్రొవ్విడి లింగరాజు చేసిన మాక్సిమ్ గోర్కీ 'అమ్మ'. ప్రగతిశీల శిబిరంలో ఉన్న యువతీ యువకుల మీద అది వేసిన ముద్ర ఎంత గాఢమైనదో చెప్పనవసరం లేదు. సాహిత్యం కొనడానికి ఏ పుస్తకాల అంగడీ లేని కర్నూలు నుంచి చదువుకోసం తిరుపతి పోవడం నా జీవితానికి ఎన్నో మలుపులను ఇచ్చింది. అందులో ఒకటి తిరుపతి విశాలాంధ్ర బుక్ స్టాల్. కోసక్కులు, గొప్పవారి గూడు, తండ్రులు కొడుకులు, జమీల్యా, పేదజనం-శ్వేతరాత్రులు, సమరము శాంతి, అయిలీత, సమరంలో కలిసిన గీతలు, కాకలు తీరిన యోధుడు, నలభై ఒకటవ వాడు, పిల్లలకే నా హృదయం అంకితం?. ఇదీ వరుస? హాస్టల్ రూము గూటి నిండా రష్యన్ అనువాద పుస్తకాలే ఉన్న కాలమది.

ఆ కథల్లోని అందమైన యువతులందరినీ ప్రేమించాను. ముసలి రైతులను, కార్మికులను మన పెద్దయ్యలుగా అనుకున్నాను. తల పండిపోయిన రష్యన్ అమ్మలలో మా అమ్మ కనిపించేది. ప్రపంచ యుద్ధానికి సైనికులను మోసుకుపోతున్న బొగ్గు రైలు కూతలు వినిపించేవి. శీతల గాలులకు వూగే గోధుమ కంకులు, సైప్ మైదానాల్లో మేస్తున్న బలిసిన తెలుపు గోధుమ రంగు యూరోపియన్ గుర్రాలు, ఆకాశాన్నంటే పోప్లార్ చెట్లూ, వాటి మీదుగా పడుతున్న లేత ఎండలు, తుంపరాలుగా వెన్నెల రాతిరి కురిసే మంచు? అన్నీ రూములో నా కిటికీ పక్కన సాక్షాత్కరించేవి. నేను నేరుగా చదివిన ఇంగ్లీషు పుస్తకాలు వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. (ఉద్యోగ నిమిత్తం కెమిస్ట్రీ తప్ప మరేదీ ఇంగ్లీషులో చదవను) ఇప్పటికీ కల్పనా సాహిత్యాన్ని ఇంగ్లీషులో చదవడానికి ఇష్టపడను. ఎందుకో అవి మనసుకు దూరంగా అనిపిస్తాయి. నావంటి తెలుగు బడుద్దాయి, బడుద్దాయినుల కోసమే అనువాదకుల రూపంలో ఎప్పటికప్పుడు ప్రత్యక్ష మవుతారని మిత్రుల ఉవాచ............................

  • Title :Dostoevsky Idiot
  • Author :Y Venugopal Reddy
  • Publisher :Sahiti Prachuranalu
  • ISBN :MANIMN6072
  • Binding :Hard Binding
  • Published Date :JAN, 2025
  • Number Of Pages :358
  • Language :Telugu
  • Availability :instock