వ్యక్తిత్వ నిర్మాణం
నాయకత్వ లక్షణాలు
వ్యక్తిత్వం నిర్మాణంలో ప్రధానాంశం సంయమనంగా వుండడం. ప్రపంచం అంతా వేగంగా కదులుతోంది. పాత ఆలోచనలు, కొత్త రూపంలో అవతారం ఎత్తుతున్నాయి. మార్పును ఎదుర్కొనే అనేక తిరోగమన శక్తులు కొత్త ముఖం తొడుక్కొని సమాజంలో తిరుగుతూ, మనల్ని నమ్మ పలుకుతున్నాయి. స్వాములు, యోగులు అందరూ వల్లించే అసత్యాల్లో కొత్త జీవితాన్ని వెతుక్కుంటూ బ్రతుకుతున్నారు. అందరూ చెప్పేవాళ్ళే అయితే ఆలోచించే గుణం నశిస్తుంది కదా! అనేక పర్వర్షన్సు మనుషులను నడిపిస్తున్నాయి. వివాహ వ్యవస్థలో వున్న నిజాయితీ బాగా క్షీణిస్తుంది. సంతాన మాత్రంగా, ఆస్తి వారసులను సృష్టించడం తో అది నడుస్తుంది. జీవించడమంటే వ్యసనాలతో జీవించడం, పంచేద్రియాలను తృప్తిపరుస్తూ జీవించడం అనే ఒక చర్య నడుస్తుంది. మరణం అంటే భయపడిపోతున్నారు. తాము ఎందుకు బ్రతకాలో అర్థం కాని పరిస్థితుల్లో బ్రతుకు మీద ఆశ ఎక్కువవుతుంది. మనం బ్రతకడం కోసం ఇతరులను హింసించడం, మనం బ్రతకడం కోసం ఇతరుల సొమ్మును కాజేయడం ఇది నిత్యకృత్యమైంది. జీవనం కళాత్మకమైంది. దాన్ని వ్యామోహాల్లో ఛిద్రం చేసుకొంటున్నారు.
ఎక్కువ మంది వాయిస్ కి ఎడిక్ట్ అవుతున్నారు. ఒక విషయాన్ని చర్వితచరణంగా ప్రస్తావించడం వల్ల ధ్వనికి అలవాటు పడడమేగాని, అందునుంచి జ్ఞానం స్రవించదు. ఒకరిని ఒకరు మోసగించుకోవడం ఒక నిత్య...............