డా॥ అంబేడ్కర్ ఆధ్వర్యంలో
పనులు, గనులు, అధికారాల శాఖ
పనులు, గనులు, అధికారాల శాఖ అనే కొత్త శాఖ స్థాపనతో 1946, ఏప్రిల్ 8 నుంచి కార్మిక శాఖ పనుల విభజనల అమలులోకి వచ్చింది.
ఈ పనులు గనులు అధికారాల శాఖ కేంద్ర ప్రభుత్వ పనుల శాఖ (పి.డబ్ల్యు. డి) కేంద్ర నిర్మాణాల ప్రొజెక్టర్ల నిర్వహణలాగా సివిల్ ఇంజనీరింగ్ గనులు, ఖనిజాలు, భారత భూగర్భ సర్వే, కేంద్ర జల మార్గాలతో సహా పెద్ద తరహా నీటి పారుదల పనులు, నీటిపారుదల, నౌకాయాన సమితి, విద్యుత్తు, స్టేషనరీ, ప్రింటింగ్ మొదలైన అంశాలను చూస్తుంది.
కార్మిక శాఖ ఎప్పటిలాగే ఐ.ఎన్.టి.సి. కార్మిక సంక్షేమం, కార్మిక సంబంధాలు, అమలు, రక్షణ ప్రమాణాలు, మాజీ భద్రతా చర్చలు, కార్మిక చట్టాల శాసనీకరణ సైనికోద్యోగులకూ స్త్రీలకూ సంబంధించి పునరావాసం; సాంకేతిక, వృత్తిపర శిక్షణా పథకాలు, కార్మిక చట్టాలు - గణాంకాలు, పరిశోధన, దర్యాప్తు అంశాలను చూస్తుంది.
ఈ రెండు శాఖలు కార్మిక సభ్యుడు గౌ॥డా॥బి.ఆర్. అంబేడ్కర్ ఆధ్వర్యంలో ఉంటాయి. బొగ్గు ఉత్పత్తి తాత్కాలికంగా ఎప్పటిలాగే పరిశ్రమలు - సరఫరాల సభ్యుని ఆధ్వర్యంలోనే ఉంటుంది.
గౌరవనీయులు శ్రీ హెచ్.సి.ప్రియర్ ఈ పనులు గనులు అధికారాల శాఖ కార్యదర్శిగా ఉంటారు. శ్రీ ఎస్. లాల్ కార్మిక శాఖ కార్యదర్శిగా ఉంటారు.
దామోదర్ ప్రాజెక్ట్
55కోట్ల రూపాయల దామోదర్ నదీ ప్రాజెక్ట్ మొట్టమొదటి ఆనకట్ట నిర్మాణం పని తిలైయావద్ద వెంటనే ప్రారంభించే అవకాశం గురించి సత్వరమే దర్యాప్తు చేయాలని................