• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Dr B R Ambedkar Kula Nirmulana

Dr B R Ambedkar Kula Nirmulana By D Candrashekar

₹ 160

  1. తొలి పలుకులు

 

కుల నిర్మూలన

మిత్రులారా, 

ఈ సమావేశానికి అధ్యక్షత వహించమని దయతో నన్ను ఆహ్వానించిన జాత్- పాత్ తోడక్ మండల్ సభ్యుల గురించి చింతిస్తున్నాను. నన్ను అధ్యక్షునిగా ఎంచుకున్నందుకు వారికి చాల ప్రశ్నలు ఎదురవుతాయని కచ్చితంగా చెప్పగలను. లాహోర్లో జరుగుతున్న ఈ సభకు అధ్యక్షత వహించటానికి బొంబాయికి చెందిన వ్యక్తిని ఎందుకు దిగుమతి చేసుకుంటున్నారో చెప్పండని మండల సభ్యులను ప్రశ్నిస్తారు. ఈ సభకు అధ్యక్షత వహించటానికి, మండల సభ్యులు, నాకంటే అర్హుడైన వ్యక్తిని సులభంగా తీసుకురాగలరని నా నమ్మకం. నేను హిందువులను విమర్శించాను. వారు ఎంతగానో గౌరవించే 'మహాత్మ' (గాంధి) ఆధిపత్యాన్ని నేను ప్రశ్నించాను. వారు నన్ను ద్వేషిస్తారు. వారికి నేను పంచలో పాము వంటి వాడిని. ఎంతో గౌరవనీయమైన ఈ స్థానం కోసం అంబేడ్కర్ను ఎందుకు పిలిచారో చెప్పండని, రాజకీయ వాదులైన హిందువులు మండల సభ్యులను అడుగుతారనటంలో సందేహం లేదు. ఇది ఎంతో ధైర్యంతో చేసిన పని. కొందరు రాజకీయ వాదులైన హిందువులు దీన్ని తమకు అవమానంగా భావించినా ఆశ్చర్యం లేదు. ఇలా నన్ను ఆహ్వానించటం సాధారణ హిందూ మతస్తులకు సయితం సమ్మతం కాబోదు. (1.1)

సభాధ్యక్షుని ఎంపికలో మీరు (ధర్మ) శాస్త్ర నియమాలను ఎందుకు వల్లంఘించారో చెప్పండని (వారు) మండల సభ్యులను నిలదీయవచ్చు. శాస్త్రాల ప్రకారం, బ్రాహ్మణుడు మిగతా మూడు వర్ణాల వారికి గురువు; 'వర్ణానాం బ్రాహ్మణో గురు" అనేది శాస్త్రాలు నిర్దేశించిన సూత్రం. కనుక, ఒక హిందువు ఎవరి నుండి పాఠాలు నేర్చుకోవాలో, ఎవరి నుండి నేర్చుకోకూడదో మండల సభ్యులకు తెలుసు. విద్యావంతుడైన ఇతర కులస్తుణ్ణి గురువుగా అంగీకరించటాన్ని శాస్త్రాలు అనుమతించవు. మహారాష్ట్రకు చెందిన బ్రాహ్మణ సాధువు రామదాస్ ఈ విషయాన్ని.................................

  • Title :Dr B R Ambedkar Kula Nirmulana
  • Author :D Candrashekar
  • Publisher :Peacock Classics, Hyd
  • ISBN :MANIMN5326
  • Binding :Papar Back
  • Published Date :April, 2024
  • Number Of Pages :143
  • Language :Telugu
  • Availability :instock