ఎందరో మహానుభావులు
“అది స్వరాజ్య కాంక్ష నసువులర్పించిన ప్రాణికోటికి నెల్ల పర్వదినము
అది దుర్భర క్షుదాయాస పీడిత జీవి
తములకు దివ్యామృతంపు సోన
అది పరాదీశులు నదలించి యెదిరించి
సాగనంపిన యహింసా బలంబు
అది తప్పించి కృశించినట్టి హృత్సితులన్
చిగురింప జేసిన జీవగఱ్ఱ"
భారతదేశం పుణ్యభూమి, వేదాలకు ఉపనిషత్తులకు, పురాణాలకు భారత భాగవత గాథలకు నెలవు. మహర్షులు పుట్టిన దేశం. మహనీయులు జన్మించిన దేశం, నదీనదులు గలదేశం అత్యున్నత పర్వత సంపదగల దేశం భారతదేశం. పాడి పంటలకు, సహజ వనరులకు పేరెన్నికగన్నది. ఔషధులు మొలచిన దేశం, తరతరాలుగా అద్భుత చరిత్ర గలదేశం. నీతికి, సత్య, అహింసలకు, పేరెన్నిక గన్నదేశం. ఒక్కమాటలో చెప్పాలంటే భారతావని వేదభూమి. మరియొక జన్మవుంటే. భారతదేశంలోనే జన్మించాలని తాపత్రయం, తపన గలిగించు భూమి. ఇంతటి మహాత్తరమైన భూమిలో, గౌతమ బుద్ధుడు, స్వామి వివేకానంద, జ్యోతిబా పూలే, షాహు మహారాజ్, నారాయణగురు, పెరియార్, ఇ.వి. రామస్వామి, నవయుగకవి చక్రవర్తి జాషువా, గురు రవిదాస్, కబీర్, గురునానక్ అను పలువురు ప్రసిద్ధులు జన్మించినారు. దేశ పరిరక్షణయే కర్తవ్యమని భావించి పలువురు మహనీయులెంచి చరితార్థులైనారు. తమ వాక్ నైపుణ్యత చేత, ప్రజ్ఞా ప్రాభవములచేత, అపార మేధో సంపదచేత, రచనా పాటవమున, ఖండ ఖండాంతరము ఖ్యాతి నార్జించిన వారున్నారు. తమ సర్వస్వము దేశ సేవ కర్పణ గావించి చరితార్థులైన వారున్నారు. భారత మాత భానిస శృంఖలాలను తెంచడానికి నవ్వుతు తమ ప్రాణాలను బలి యొసగిన వారున్నారు. దేశమే తన ప్రాణమని, ఆమరణ ప్రాయోపవాస దీక్షబట్టి చరితార్థులై, దేశ దేశములచే గొనియాడబడిన