మార్పు నా తీర్పు
పచ్చదనాన్ని కత్తిరించి
ప్రాణకాంతిని కబళించి
మోడులా మిడిసిపడే
మొరటుగుండె శిశిరానికి
చెరసాల నా తీర్పు.
కళ్లలో చీకటిదుమ్ము కొట్టి
కాళ్లను ముళ్లపొదల్లో నెట్టి
ప్రగతిని తప్పుదారి పట్టించే
దగుల్బాజీ నిశీధానికి
మరణశిక్ష నా తీర్పు
నేడంటే జడుసుకుని
రేపంటే తోకముడుచుకుని
నిట్టూర్పుల నీలిపొగలను
పట్టుకు వ్రేలాడే నిరాశకు.
నిలువుపాతర నా తీర్పు.