అవతారిక
“నవ్వని పువ్వు” మొదలైన నాటికలు బహుజనాదరణ పొందినవే కావడంచేత నా పని వీటిని పరిచయం చేయడం కానేకాదు. శ్రవ్య గేయ నాటికారచనలో సిద్ధహస్తులైన శ్రీ నారాయణరెడ్డి వీటి కల్పనంలో చూపిన కొన్ని చమక్కుల్ని ఉటంకించడానికి ప్రయత్నించడమే నేను చేయదల చుకున్న శ్రమ. ఉత్తమ కవి చైతన్యానికి పులకించి కవిత్వం తీరు తీరు రూపాల్ని ధరిస్తుంది. సమాజ రూపాన్ని సంస్కర్తలూ, విప్లవకారులూ మార్చివేస్తున్నట్లే కవీ కవితారూపాన్ని ఊరికే మారుస్తుంటాడు. అయితే ఈ నాటికారూపం మనకు కొత్త కానేకాదు. నాటిక అనగానే ప్రదర్శనకు ఉపయోగపడేదని ఇంచుమించు అందరి అభిప్రాయమూను. నాటకం దృశ్యమూ, శ్రవ్యమూను. అందుకే ఇతర కావ్యరూపాలకన్న నాటకరూపం అత్యంత ఆదరణీయంగా వుంటుంది. చూడడానికి ఆకర్షవంతమైన వేషాలు ధరించిన పాత్రలూ, వినడానికి శ్రవణపేయమైన పాటలూ కలిసి నాటకం కదా! అయినా శ్రీ నారాయణరెడ్డి కేవల శ్రవణయోగ్యమై రసా పాదకములైన నాటికలు రచించారు. పైగా వీటిల్లో పాత్రలు వచనం పలకవు - వచనంలోని సోమరితనానికి వళ్లుమండి కవి భావాలు గేయాలుగా ప్రవహించినవి గనుక. భిన్న భిన్నార్థ స్ఫురణాన్నీ (Suggestive ambiguity) ప్రత్యక్ష నాదశక్తి (Direct tonal quali- ty) వచనానికంటే గేయంలో అధికంగా ఉజీవిస్తుంది గనక ఈయన తన....................