బాపూ నీ పుట్టిన రోజు
బాపూ నీ పుట్టిన రోజు
భగవానుడు పుట్టిన రోజు
ఒక రాముడు పుట్టిన రోజు
ఒక రహీము పుట్టిన రోజు.
చావులేని పుట్టుకలేని
సత్యమూర్తి పుట్టిన రోజు.
దాస్యంలో విలవిలలాడే
ధర్మం తొడగొట్టిన రోజు.
కుత్సితాల కులమతాల
కోటలు పడగొట్టిన రోజు.
చురకత్తుల గుండెల్లోన
చిరునవ్వులు మెట్టిన రోజు.
దొరలకు శిరసొగ్గని రోజు
మరలకు మనసివ్వని రోజు.
చరఖాతో భారతమాతకు
పరువును నిలబెట్టిన రోజు...................