ఎవరయ్యా ఎందుకు మీ
రెండు కురుకుతున్నారు.
ముళ్ళలాగ దిగిపోయిన
కాళ్ళు పెరుకుతున్నారు.
ఇటు నిరాశ అటు దురాశ
ఏది ఏది మీ గమ్యం?
కదురులేని బ్రతుకుమీద
కలలు వడుకుతున్నారు.
సన్నగిల్లెనా ధైర్యం?
సపోయె శౌర్యం ?
రగిలే వేసవిలో ఇం
తగా వణుకుతున్నారు.
ఇరుకునుంచి బయటపడీ
వెరపులోంచి కుదుటపడీ
ఈ యెడారి పొదుగునుంచి
ఏమి పితుకుతున్నారు?..............