• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Dr C Narayana Reddy Samagra Sahityam- Vol 18

Dr C Narayana Reddy Samagra Sahityam- Vol 18 By Dr C Narayana Reddy

₹ 150

నన్నెచోడుని కవితాశక్తి

నన్నయ తరువాత ఆతడేర్పరచిన రాచబాటను కాదని తన దారి తానవలంబించి దానిని ఘంటామార్గముగా మలచుకొన్న కవిరాజశిఖామణి నన్నెచోడుడు. ఎంతకును నన్నయ్య దృష్టి కళానిష్ఠము. ఆతని కవిత ప్రసన్న కథాకలితార్థయుక్తి పరిపుష్టము. మరి నన్నెచోడుని కవిత ఖవస్తు నిస్తులము. నన్నెచోడుడు మాటిమాటికి వస్తుకవితను ప్రస్తావించెను. భారవిని వస్తుకవితను భారవియనెను. ఉద్భటుడు సంస్కృతములో జకుమారసంభవమ్ము నలంకారము గూఢవస్తుమయ కావ్యముచ గా చెప్పెననెను. జసమస్త వస్తుకవీశ్వర నూత్నకావ్యరుచిర రత్నవీధి యెట్లుండవలెనో విపులీకరించెను. తాను సైతము జజంగమ మల్లయ వరమునందుగనిన వస్తుకవిత ను వ్రాయుచున్నట్లు పేర్కొనెను. ఇన్నిమారులీ వస్తుకవితను ప్రస్తుతించినను స్పష్టముగా దానిని నిర్వచించలేదు. కావ్యము "దశ ప్రాణంబుల ప్రాణంబై నవరసభావ భరితంబై షట్రింశదలంకారాలంకృతంబై" రమణీయముగా నుండవలెనని మాత్రము వాకొనెను. అనంతర ప్రబంధములకు నిర్బంధగుణములైన అష్టాదశ వర్ణనముల పట్టిక యిచ్చెను.

"వనజల కేళీ రవిశ
తనయోదయ మంత్రగతిరతక్షితిపరణాం
బునిధి మధు ఋతు పురోద్వా
హ నగ విరహ దూత్య వర్ణనాష్టాదశమున్"

ఈ లక్షణములన్ని పరిశీలించినచో నన్నెచోడుని దృక్పథము కొంత..............

  • Title :Dr C Narayana Reddy Samagra Sahityam- Vol 18
  • Author :Dr C Narayana Reddy
  • Publisher :Viswambhara Vision Publications
  • ISBN :MANIMN4527
  • Binding :Paerback
  • Published Date :June, 2001
  • Number Of Pages :407
  • Language :Telugu
  • Availability :instock