• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Dr Saluru Rajeswara Rao Cini Sangeeta Sourabham

Dr Saluru Rajeswara Rao Cini Sangeeta Sourabham By Dr K Suhasini Anad

₹ 300

కళాప్రపూర్ణ డా. సాలూరు రాజేశ్వరరావు సినీ సంగీత సౌరభం
 

భారతీయ చలనచిత్రరంగ సంగీతం - మూకీ, టాకీల యుగం

సంగీతం ఒక “మహాసాగరం" అంటారు. నిజానికి మహాసాగరాలకు సైతం అవధులున్నాయన్నది జగమెరిగిన సత్యం. విస్తృతిలోగానీ, అంతు తెలియని లోతులకు సంబంధించిన విషయంలోగానీ పరికించి చూస్తే, సంగీతం ఆ మహా సాగరాలన్నిటినీ మించిపోయిందని చెప్పక తప్పదు. కారణం, ఉత్తర భారత సంగీతాన్ని "హిందూస్థానీ” సంగీతం, దక్షిణ భారత సంగీతాన్ని “కర్ణాటక” సంగీతం అనబడే రెండు మహాసాగరాలు భారతీయ సంగీతాన్ని అవధులు లేనంతగా సుసంపన్నం చేశాయి.

ఉత్తర భారతాన తాన్సేన్ మొదలుకొని పండిట్ ఓంకార్నాథ్ ఠాకూర్, ఉస్తాద్ అల్లాయుద్దీన్ ఖాన్, బడే గులామ్ ఆలీఖాన్, విష్ణు దిగంబర్ పలుస్కర్, పండిట్ రవిశంకర్, పన్నాలాల్ ఘోష్, దక్షిణ భారతాన అన్నమయ్య, పురందరదాసు, క్షేత్రయ్య, త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి గార్లు (వీరు ముగ్గురూ సంగీత త్రయముగా ప్రసిద్ధిగాంచారు) మొ॥ వాగ్గేయకారుల వలన తిరుగులేని విస్తృతి పొంది, నిన్నమొన్నటి శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణగారి వరకు, అటు "హిందూస్థానీ” సంగీతం ఇట కర్ణాటక సంగీతం, హిమాలయం వంటి ఎత్తునూ, హిందూ మహా సముద్రాన్ని మించిన లోతులనూ చవిచూశాయి.

అటువంటి విశుద్ధమైన, అతి స్వచ్ఛమైన సంగీతమే భారతీయ సినీసంగీతాన్ని ప్రభావితం చేసింది. భారతీయ చలన చిత్రాల ప్రారంభదశలో కథలన్నీ పౌరాణికములైనందువలన మధురమైన కృతులనూ, మనోజ్ఞమైన కీర్తనలనూ, జావళీలనూ, తమ చలన చిత్ర సంగీతానికి పరమావధిగా ఎంచుకొని ఆనాటి సంగీత దర్శకులూ, గాయకులూ విరాజిల్లారు.

దక్షిణాదిలో తెలుగు చలన చిత్ర సంగీతం కూడా మొదట్లో ఈవిధంగానే సాగింది. తెలుగు చిత్రాలు పౌరాణిక కథలతో నిర్మితమవడం వలన, అప్పటి రంగస్థలం పై వేసిన పౌరాణిక నాటకాలలోని పద్యాలు, జావళీలు, కీర్తనలు, యక్షగానాలు.................

  • Title :Dr Saluru Rajeswara Rao Cini Sangeeta Sourabham
  • Author :Dr K Suhasini Anad
  • Publisher :Rasi Care NGO
  • ISBN :MANIMN6132
  • Binding :Papar Back
  • Published Date :Dec, 2024 2nd print
  • Number Of Pages :170
  • Language :Telugu
  • Availability :instock