చిత్రకళ ప్రయోజనం
బొమ్మలు గీసే పిల్లల్ని " బొమ్మలు తిండి పెడతాయా?" అంటూ పెద్దలు కోప్పడతారు. బొమ్మలు గీయడం వల్ల ప్రయోజనం లేదనీ, అది ధనార్జనకూ, జీవన భృతికి పనికిరాదని వారి అభిప్రాయం. గతంలో అది వారి అనుభవం కావచ్చు. కానీ యీ రోజులలో ఆ మాటకు అర్ధంలేదు. బొమ్మలు వేసేవాళ్ళు కూడా జీవన భృతిని సంపాదించుకుంటున్నారు.
ఉద్యోగాలు చేస్తున్నారు. హాయిగా బ్రతుకు తున్నారు. 'చిత్రకళ' వృత్తి విద్యలలో ఒకటయింది. గోడ పెయింటర్ల దగ్గర నుంచి సినీ ఆర్ట్ డైరెక్టర్ల వరకూ చిత్రకారులే.
బొమ్మలు నేర్చుకున్న వారికి అనేక జీవనాధారాలు, అనేక వృత్తులు ఈ రోజులలో వున్నాయి. ఈ అవకాశాలు యింకా యెక్కువ అయ్యే పరిస్థితి కూడా వుంది. దుకాణాలకు బోర్డులు రాసేవారు ప్రతి నగరంలోనూ వుంటారు. వారు చిత్రకారులే. అక్షరాలనూ, -బొమ్మలనూ అందంగా గీయగలిగితే చాలు. ఆ పని చేయవచ్చు. వాళ్ళని సైన్ బోర్డు ఆర్టిస్టులంటారు. వారు రేకు బోర్డులమీద, గోడల మీద, చెక్క బోర్డులమీద, గాజు పలకలమీద (షో కేసుల మీద) అందముగా పెయింట్ చేస్తూ డబ్బులు సంపా దిస్తూంటారు. వీరు వార్నిష్ పెయింట్లను, ఎనామెల్ పెయింట్లను వాడుతారు......................