నమో నమః శ్రీ గురుపాదుకాభ్యామ్
ఎవర్ ది ఎక్స్పీరియెన్సర్, నెవర్ ది ఎక్స్పీరియెన్స్డ్
అనుభవించే నేనే అది ఎప్పటికీ, అనుభవించబడే వస్తువు కాదు ఎన్నటికీ
పరమార్థానంద స్వామీజీ ఈ భావాన్ని మనస్సులో హత్తుకుపోయేలా, నిద్రలో లేపి అడిగినా, చెప్పగలిగేలా ప్రతి ఒక్క ఉపనిషత్తులోనూ చెపుతూనే ఉంటారు.
కొన్ని కాన్సెప్టులను మనలో నాటుకునేలా చేయటానికి అలుపెరగకుండా కొన్ని వందలసార్లు, కాదు కొన్ని వేల సార్లు చెబుతారు. అందులో మొట్టమొదటిది చైతన్యం యొక్క ఐదు లక్షణాలు. అంతేకాదు దాన్ని వివరించటానికి కాంతి-చేయి ఉదాహరణ అన్నిసార్లూ ఇస్తారు. (దృగ్దృశ్య వివేకములో కూడా 4వ శ్లోకానికి ఇచ్చిన వివరణలో ఈ విషయం చూడవచ్చు). స్వామీజీయే చెప్పారు, ఒకసారి తన శిష్యులకు చెప్పారుట కూడా, మీలో ఎంతమంది ఈ 5 లక్షణాలనూ చూడకుండా రాయగలరో, ఇంటికి వెళ్ళి ప్రయత్నించి చూడండి అని.
దాని తర్వాత చెప్పే రెండో అంశం పైన చెప్పినది.
ఎవర్ ది ఎక్స్పీరియెన్సర్, నెవర్ ది ఎక్స్పీరియెన్స్
దాన్ని ఎలా జీర్ణించుకోవాలో చెబుతారు. వేదాంత శిష్యులు ఎక్కువగా ఒక సమస్యను ఎదుర్కొంటారు. వారు వేదాంతాన్ని అధ్యయనం చేసి బాగానే అర్థం చేసుకుంటారు. వచ్చిన చిక్కేమిటంటే సమస్య, దాని పరిష్కారం బుద్ధికి బాగానే అర్థం అయింది, కాని మనస్సు మాట విననంటోంది. దాన్ని ఆచరణలో పెట్టలేకపోతోంది. అందువల్ల బుద్ధి అర్థం చేసుకున్న జ్ఞానానికి, భావోద్రేకానికి లోనయ్యే మనస్సు ప్రవర్తించే తీరుకూ హస్తిమశకాంతరం అంత తేడా ఉంది. మనస్సులో పేరుకుపోయిన రాగద్వేషాలు, కామక్రోధాలు, చికాకులు, బెంగలు ఏవీ ఏ మాత్రం తగ్గటం లేదు. ఇది తగ్గటానికి స్వామీజీ చాలా తేలికైన ఉదాహరణ ఇస్తారు. అది ఇది.
పంచే కట్టుకున్న ఒక వ్యక్తికారులో వెళుతున్న వ్యక్తిని సాగనంపటానికి వచ్చాడు. వెళుతున్న కారులో అతని పంచె చిక్కుకుపోయింది. కారు వెంట పరుగెత్తి అందుకోలేక పోతున్నాడు. అయితే ఏం చేయాలి? దానికి ఒకటే మార్గం. పంచెను...........