• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Drushyadrushyam

Drushyadrushyam By Chandralata

₹ 295

మన ముందు నిలిచిన ఓ మౌలిక ప్రశ్న "దృశ్యాదృశ్యం"

"ప్రకృతి పై మనం సాధించాలనుకుంటోన్న ఆధిపత్యం ఎలా పరిణమించబోతోంది? ఆ పట్టు ఎవరి గొంతు చుట్టూ బిగుసుకుంటోంది? ఇలాగే కొనసాగితే చివరకు ఏమి మిగులుతుంది? అన్న ముఖ్యమైన ప్రశ్నలతో మన ముందు నిలిచింది చంద్రలత నవల "దృశ్యాదృశ్యం."

ఇది ఓ మౌలిక ప్రశ్న.

ప్రకృతిలో అంతర్భాగమైన మానవ మనుగడకు సంబంధించిన ప్రశ్న. సమస్త భూమండలానికి

సంబంధించిన ప్రశ్న.

పాశ్చాత్య సాహితీ ప్రపంచంలో ఇలాంటి ఆలోచనాధోరణి 60వ దశకంలోనే ప్రారంభమైంది. అందుకు మూలం "రాఫెల్ కార్బన్" అనే అమెరికన్ రచయిత్రి రచించిన "సైలెంట్ స్ప్రింగ్" అన్న

నవల.

అవి హరిత విప్లవం ముమ్మరంగా ఉన్న రోజులు. రైతులు విరివిగా వినియోగిస్తున్న DOT వలన పురుగులు నశించడం, ఆ విషపూరిత కీటకాలను తిన్న పక్షులు తీవ్ర ప్రభావానికి గురికావడం, ఆ పక్షుల గుడ్ల పెంకు పలుచన కావడం, క్రమంగా ఆ పక్షిజాతి కనుమరుగై పోవడం - ఇది నవలలోని కథ.

సెలయేరులా నిరంతరం ప్రవహిస్తూ ఉండవలసిన జీవనస్రవంతి ఇలా నిశ్శబ్దంగా అదృశ్యమై పోవడాన్ని - ఆమె ఆ నవలలో ప్రశ్నించారు.

"ప్రకృతి ఉన్నది మనం ఆధిపత్యం వహించడానికే!" అన్న ఆలోచన కలిగిన అమెరికన్ల ముందు ఒక కొత్త ఆలోచన కొత్త ప్రశ్న నిలబడింది. "ప్రకృతి మన కొరకు, కానీ మనం ప్రకృతి కొరకు

కాదా?"

ఆ నవల మిలియన్ల కొద్దీ కాపీలు అమ్ముడయ్యి అమెరికన్ బెస్ట్ సెల్లర్ అయ్యింది.

అమెరికన్లలో పర్యావరణ స్పృహను మేల్కొలిపినటువంటి ఆ పుస్తకాన్ని అమెరికన్ పౌరులు ఎంతో ఆదరించారు. ప్రభావితం చెందారు. ఆ ప్రభావం న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి ప్రతినిధులను కూడా స్పందింపజేసింది. వారిలో ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తింది. అది- "అభివృద్ధి అంటే ఏమిటి?"

అప్పటి వరకూ "శాస్త్రం శాస్త్రం కొరకే... ఆవిష్కరణ కొరకే" అన్న ఆలోచనా ధోరణి కలిగిన పాశ్చాత్యులు ఒక్కసారిగా కొత్త ప్రశ్న వేసుకున్నారు. "శాస్త్రాలూ ఆవిష్కరణలూ ప్రకృతి పై చూపుతోన్న ప్రభావం ఏమిటి?"

అప్పుడు అక్కడి అన్ని రంగాలలోని నిపుణులూ తమ తమ సబ్జెక్టులకు పర్యావరణ స్పృహను జోడించి పునరాలోచన ప్రారంభించారు. ఈ దిశలో వారి పరిశోధన ఎంతో విస్తృతంగా జరిగింది. ఆ క్రమంలోనే వారు ఓజోన్ పొర పలుచబడడం, భూమండలం వేడెక్కడం లాంటి అనేక సమస్యలను గుర్తించారు................

  • Title :Drushyadrushyam
  • Author :Chandralata
  • Publisher :Prabhava Publications
  • ISBN :MANIMN4767
  • Binding :Papar back
  • Published Date :2018 5th print
  • Number Of Pages :418
  • Language :Telugu
  • Availability :instock