• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Du Fu Jeevitamu Kavitvamu

Du Fu Jeevitamu Kavitvamu By P Srinivas Gowd

₹ 120

చీనా కవిత్వ కాంతుల్లో

చైనా కవిత్వం గురించి మొదట గాలి నాసరరెడ్డి గారి దగ్గర విన్నాను. అప్పటికి ఆయన చైనా కవిత్వం తెలుగులోకి అనువాదం చేసి వున్నాడు. ఆయన అనువాదంలో చైనా కవిత్వం లోని సారళ్యత ముందుగా నన్ను పట్టుకుంది. ఆ తర్వాత జపనీయ హైకు సాహిత్యం ఆవహించిన పిదప కొన్నాళ్ళకి మరలా వాడ్రేవు చినవీరభద్రుడు గారు తమ వ్యాసాలలో చీనా కవిత్వ కాంతులు చూయించారు. ఆయన ఆ కవిత్వాన్ని గొప్ప పరవశంతో మనకు పరిచయం చేసే పద్ధతి వల్లా, ఆ కవిత్వం అడుగు కనపడే ఒక స్వచ్ఛమైన శుభ్రజలంలా తోచడం వల్లా చీనా కవిత్వానికి ఆకర్షితుణ్ణి అయ్యాను.

దేశాలకు గొప్ప సాహిత్య సంపద వున్నట్లే చైనాకూ గొప్ప సాహిత్య సంపద వున్నది. క్రీస్తు పూర్వం నుంచే ఎవరు రాసారో తెలియని వేల గీతాలు తరాలు దాటి, పరంపరగా వాటి ప్రాశస్త్యాన్ని నిలుపుకుంటూ వచ్చాయి. చైనీయ తత్వవేత్త కన్ఫ్యూషియస్ (క్రీ.పూ. 551 - 479) వాటిని ఒక దగ్గర చేర్చి, 305 గీతాలతో షి చింగ్ (Shih Ching The Book of Classic Poetry) సంకలనం చేసాడు. ప్రాచీన కాలం నుంచీ చైనీయ సంస్కృతిలో కళలు, సాహిత్యమూ అంతర్భాగంగా వుండడం వల్ల కూడా అక్కడ గొప్ప సాంస్కృతిక వైభవం పరిఢవిల్లింది.

.

చైనాలో తంగ్ రాజవంశ ఏలుబడిలో వున్న కాలాన్ని (618-905) సాహిత్యానికి స్వర్ణయుగంగా చెపుతారు. ఈ కాలంలోనే లి బాయి (701-762), నాంగ్ వీ (706-761), దు.పు (712-770) వంటి మహాకవులు జన్మించారు. ఆ కాలంలో రాజరిక ఆస్థానాలలో ఉద్యోగాలు, పదవులు పొందాలంటే ప్రభుత్వం నిర్వహించే పరీక్ష (జిన్షి)లో ఉత్తీర్ణులు కావలసి వుంది. దానికి కన్ఫ్యూషియస్ ఆలోచనా ధార, చైనా చరిత్ర, ప్రాచీన శాస్త్రాల ఆపోశన, పూర్వ కవిత్వ అధ్యయనం, కవిత్వం రాయడం మొదలయిన వాటిలో అభ్యర్థులు ప్రావీణ్యులై...........................

  • Title :Du Fu Jeevitamu Kavitvamu
  • Author :P Srinivas Gowd
  • Publisher :Ennela Pitta
  • ISBN :MANIMN5991
  • Binding :Papar Back
  • Published Date :Dec. 2024
  • Number Of Pages :98
  • Language :Telugu
  • Availability :instock