చండీ మూలమంత్రం జపం చేయు విధానం:
"ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే"
చండీ అమ్మవారి యొక్క మూలమంత్రం జపసిద్ధికోసం నాలుగులక్షలు జపము చేయగలరు. జపం మన గృహంలో గాని శివాలయాలలో గాని, శక్తి క్షేత్రాలలోగాని, నదీతీరాలవద్దగాని, పీఠాలలో గాని, మఠాలలోగాని జపం చేయవచ్చు.
జపం చేయడానికి కేవలం భక్తి మరియు చండీమాతపై సంపూర్ణ నమ్మకం ఖచ్చితంగా ఉండాలి. జప సంఖ్య 4,32,000
జపం చేయుటకు మంచి సమయం ఉదయం 4-30ని||ల నుండి 6-30 ని॥ల మధ్యకాలంలో మరియు సాయంత్రం 5-45 ని॥ల నుండి రాత్రి 10-30 మధ్యకాలంలో జపం చేయవచ్చు.
జపానికి సంబంధించి కాలభైరవ గుళికమాల, రుద్రాక్షమాల, హకీక్ మాల, స్పటికమాల, పగడాలమాల ఉపయోగించవచ్చు.
జపం తూర్పుముఖంగా లేదా ఉత్తర ముఖంగా కూర్చుని చేయాలి. అవకాశముంటే పీఠపైన, దర్భాసనం లేదా చిత్తాసనం వేసుకొని దానిపై ఎరుపురంగు వస్త్రాన్ని పరచి దానిపై సుఖాసనంలో కూర్చుని జపం చేయవచ్చు.
ప్రతినిత్యం నియమిత సంఖ్య ప్రకారం జపం చేయవచ్చు. అనగా రోజు మూడు మాలలు 5 మాలలు లేదా 10 మాలలు చేయవచ్చు. ఈ అమ్మవారి మంత్రం జపం చేయుటకు ముందు గురువును స్మరించి మనసులో గురువుకు నమస్కరించి గురువు యొక్క ఆజ్ఞ పొందుతున్నట్లుగా భావించి గణపతి మంత్రం 11 మార్లు, కాలభైరవ మంత్రం 11 మార్లు, లేదా గణపతి మంత్రం ఒకమాల, కాలభైరవ మంత్రం ఒకమాల జపం చేసి తదుపరి చండీమంత్రం చేయడం వల్ల శుభఫలితాలు కలుగును. ఇంకా మీకు ఏమైనా సందేహాలుంటే గురువుగారి 9000200117 నెంబర్కు వాట్సప్ చేయండి......................