₹ 100
సృష్టి
నా అక్షరాలు
వెన్నెల రాల్చే తుడుం దెబ్బలు
నా అక్షరాలు
రాత్రికి రంగులద్దే డప్పు వరసలు
నా అక్షరాలు
కందికొత్తల సాయంత్రాన ఒకటై నడిచిన ధింసా అడుగులు
నా అక్షరాలు
కొండకు కమ్ముకున్న చీకటికి చితిపెట్టే పోడు మంటలు
నా అక్షరాలు
జాకరమ్మ ఎదుట అన్యమతానికి శిలువేసిన శిలాక్షరాలు
నా అక్షరాలు
కొండ దొంగల పై ఎక్కుపెట్టిన శిలకొల మొనలు
నా అక్షరాలు
వనాల్ని కలగనే రేపటి వెలుగు విత్తులు
నా అక్షరాలు
రేపటికి పదును పెట్టె నేటి కవితా పాద పద్యాలు
నాకు కవిత్వమంటే
అరణ్యాలను సృష్టించడమే!
- Title :Durla
- Author :Mallipuram Jagadeesh
- Publisher :Durla Prachuranalu
- ISBN :MANIMN2332
- Binding :Paerback
- Published Date :2021
- Number Of Pages :136
- Language :Telugu
- Availability :instock