రావిశాస్త్రి ఓ మహా వ్యక్తి
రావిశాస్త్రి అని తెలుగు సాహితీ లోకం ముద్దుగా పిలుచుకునే రాచకొండ విశ్వనాథ శాస్త్రి 1922వ సంవత్సరం జులై 30న శ్రీకాకుళంలో జన్మించారు. ఇతని తల్లిదండ్రులు నారాయణమూర్తి, సీతాలక్ష్మి. ఇతని స్వస్థలం మాత్రం అనకాపల్లి దగ్గర తుమ్మపాల గ్రామం. తండ్రి న్యాయవాద వృత్తి చేసేవారు.
రావిశాస్త్రి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి బి.ఏ. (ఫిలాసఫీ) పట్టా పుచ్చుకొని, ఆ తరువాత 1946లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో పట్టభద్రుడయ్యారు.
ఆ తరువాత 1950లో విశాఖపట్నంలో సొంతంగా న్యాయవాద వృత్తి చేపట్టారు. న్యాయవృత్తికి అవసరమైన మెళకువలను అతను తన తాతగారైన శ్రీరామమూర్తి దగ్గర ఆకళింపు చేసుకున్నారు.
మొదట్లో అతను కాంగ్రెస్ వాదియైనా 1960 ప్రాంతంలో మార్కిస్ట్ సిద్ధాంతాలకు ప్రభావితం అయ్యారు.
ఇతను న్యాయవాది వృత్తిని స్వీకరించాక వెనకబడిన శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల ప్రజల జీవనాన్ని విస్తృతంగా అధ్యయనం చేసారు. వాళ్ళ భాషపై మమకారం పెంచుకున్నారు.
చెప్పుకోవాలంటే గురజాడ, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిల తరువాత ఎక్కువగా మాండలిక శైలిని వాడిన వారు రావిశాస్త్రి. తన రచనల్లో ఎక్కువగా తాడిత, పీడిత వర్గాల వారికి సముచిత స్థానం ఇచ్చి వారి సమస్యలను, బాధలను తన రచనల్లో చిత్రీకరించాడు.
రావిశాస్త్రి శైలి చాలా ప్రత్యేకమైనది. ఎవ్వరూ అనుసరించలేని విశిష్టత కలిగినది..............