ఆహ్వానము :
1. శ్రీసమృద్ధికి భరతధాత్రీలలామ
పెట్టినది పేరు - వేదాంతవీధిలోన
ప్రమిద వెలిగించె|| చమురు పోయుము శివాత్మ!
ద్వారకామాయి సాయి! సన్మార్గదాయి!
2. శ్రీ షిరిడినాథ! కవితాభిషేకమిడగ
పద్యమై నిల్చితిని; రమ్ము! భావవీణ
నెటుల మీటెదవో! భారమెల్ల నీదె!
ద్వారకామాయి సాయి! సన్మార్గదాయి!
3. శ్రీచిదానందభూష! షిర్డీనివాస! “
ద్వారకామాయికిదె పద్య "తోరణమ్ము”!
వెరసి “ద్వారతోరణము” - దీవింప రావె!
ద్వారకామాయి సాయి! సన్మార్గదాయి!