ప్రశ్న: 'ధ్యానం' అంటే ఏమిటి?
ఎం: ధ్యానం అనేది చాలా విస్తృతమైన భావన. ఇంగ్లీషులో ఉపయోగించే మెడిటేషన్ అనే పదం పతంజలి యోగ సూత్రాలలోని ధారణ, ధ్యాన, సమాధి అనే మూడు భాగాలను సూచిస్తుంది.
ధారణ అంటే సామర్థ్యం లేదా శక్తి, లేదా తమ మనస్సును ప్రత్యేకించి ఒకే ఆలోచనా ప్రవాహంలో కేంద్రీకరించేలా అభ్యాసం చేయడం. అది పరిపక్వం చెంది నిరంతర ప్రక్రియగా మారినప్పుడు ధారణ, ధ్యానంగా మారుతుంది. ధ్యానం కొంతకాలం పాటు కొనసాగిన తర్వాత కలిగే అనుభవం ద్వారా సమాధి అంటే ఏమిటో అర్థం అవుతుంది. చాలాసార్లు ఇలాంటి ప్రశ్న అడిగిన వ్యక్తి పద్ధతిని గురించి అడుగుతున్నారు.
ధ్యానానికి సంబంధించిన అభ్యాసాలన్నీ పతంజలి యోగ సూత్రాలలో పొందుపరచబడి ఉన్నాయి. ధ్యానం గురించి మనం చర్చించేటప్పుడు చెప్పుకుందాం. వాస్తవమైన అనుభవం అనేది కేవలం అభ్యాసంతోనే వస్తుంది. ఇది ప్రతి వ్యక్తికి ప్రత్యేకంగా ఉంటుంది. అయితే, మెళకువలను అభ్యసించడం అనేది మంచి ప్రారంభమే. సుదీర్ఘకాలం స్థిరంగా, నిరంతర సాధనగా పతంజలి ఈ వ్యాయామాన్ని వివరించారు. ఇదే నైరంతర్యాభ్యసేన', దీర్ఘకాలే.
ఎలాంటి అంతరాయాలు లేకుండా చాలా కాలం పాటు కచ్చితంగా చేసినప్పుడు............