రామాయణ దర్శనం - పరిచయం
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమ:
ఎందరో మహానుభావులుండగా తను వ్రాసినటువంటి రామాయణ దర్శనము నకు నన్ను పీఠిక వ్రాయమని, అభ్యర్థన చేసి, ఒత్తిడి తెచ్చిన నా సన్మిత్రుడగు "సమయజ్ఞ" సంతే కూడ్లూరి తుంగాప్రాణేశ్ కు ఈ సదవకాశం ఇచ్చినందుకు ముందుగా కృతజ్ఞతలు.
చిన్నప్పటినుంచి మహత్తరమైనటువంటి శ్రీ రామాయణ గాథ విని, చదివి ఎరుగుదును. కానీ ప్రత్యక్షంగా శ్రీ వాల్మీకి రామాయణం చదివేఅవకాశం రాలేదు.
మన దేశంలో శ్రీ రామాయణ గాథను అనాది కాలం నుంచి పలువిధమైన భాషలలో కవయిత్రి మొల్ల, కంబ, తులసీదాసు లాంటి పలువురు మహామహులు రచించినారు. వాటి గురించి వినడం తప్ప చదివే భాగ్యం కలగలేదు.
“సుమిత్ర'!!” సమూహం ప్రారంభించి దేశ విదేశాలలోని మా కళాశాల మిత్రులంతా ఒకచోట చేర్చి మాకంతా ఒక మంచివేదికను ఏర్పాటు చేసింది మన మిత్రుడు ఎస్.కె. ప్రాణేశ్.
కరోనా హయాంలో అందరం స్వగృహంలో బంధితులయిన సమయంలో ఉన్నట్లుండి నాతో శ్రీ రామచంద్రుని చరిత్ర వ్రాయాలని ప్రేరణ కలిగింది గీతా... సభ్యులనుంచి ప్రోత్సాహం లభిస్తుందంటావా. చదువుతారా అని అడిగాడు. వ్రాయాలని సంకల్పించు శ్రీరామచంద్రుడే నడిపిస్తాడు. మంత్రాలయం గురుసార్వభౌమ శ్రీరాఘవేంద్రస్వాములవారి పరమానుగ్రహబలంతో భక్తితో ప్రారంభిస్తే చదువరులకు కొదవా అని చెప్పాను. కానీ మదిలో ఏమూలనో సందేహం అంతటి మహాకావ్యాన్ని ఎలా వ్రాస్తాడు సుమా? అని...............