నగ్నసత్యాల నారుమడి
ఒక అరుదైన ఇతివతృత్తంతో కవులు, కళాకారుల జీవితాలలో స్వార్థం ఎల్లిమొగ్గలు వేసి సమాజాన్ని ఛిద్రం చేయబూనిన, వైనాన్ని చిత్రించిన నవల 'ఏడో గ్రహం'. ఇలాంటి ఇతివృత్తాన్ని ఎన్నుకొని నవల రాయాలంటే రచయితకు ఘట్స్ కావాలి. ముద్రించడానికి ప్రచురణ కర్తలకూ 'కాలిబర్' కావాలి. రచయితలో ఆత్మస్థయిర్యం, నిబద్ధత, నిజాయితీ ఉంది. ప్రచురణకర్తలకు దమ్ము దన్ను ఉంది.
మన పురాణాలు, జానపదాలు, ప్రాచీనాంధ్ర సాహిత్యం మొదలు ఇప్పటిదాకా అపోసన పట్టిన శ్రీరాసానిగారు పౌరాణిక మూలాల వేర్లనుంచి ఏడోగ్రహం నవలని పైకి లాక్కొచ్చి ఈ సూపర్ యుగంలో కథ నడిపిస్తారు. పాత్రా చిత్య భాష, సంఘటనలు, సందర్భాలూ, ఎత్తుగడ, ముగింపు, శిల్పం, వేటికవే ధీటుగా నిలిచి, దారంలో పూలు పేర్చి అల్లిన మాలలాగా అమరిన నవల ఇది. ఇందులో సాహితీ ముమఘుమలు శోభించడం ముచ్చటగొల్పుతుంది.
ఈ నవల పత్రికలో ధారావాహికంగా వెలుడువతున్నపుడు అటు | పత్రికలవాళ్ళూ, ఇటు రచయితా ఎన్నో బెదిరింపులు, వత్తిడిలాంటి | ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడి నదిలోని నావను ఒడ్డుకు చేర్చిన చందాన పాఠకుల వద్దకు ఈ నవలను చేర్చారు. వారు అభినంద | నీయులు.
ఈ నవలలో పాత్రలు, సంఘటనలు, రాజకీయాలు, రాసలీలలు, కుట్రలు, కుతంత్రాలు, తెలుగు రాష్ట్రాల్లో ప్రతిచోటా నిత్యం జరుగుతున్న నిత్య సత్యాలు. నగ్న ఛిద్రాలు. దీన్ని చూసి ఓర్వలేని కొందరు సాహితీ | శిఖండులు ఎవరి ప్రమేయం లేకుండా భుజాలు తడుముకొంటు బురద జల్లేందుకు, నవలను వివాదాస్పదం చేసేందుకు శతవిధాల ప్రయత్నించారు. తెగేదాక తీగలాగాలని యత్నించి చివరకి చతి బడ్డారు. చదివిన పాఠకుల చేత వేనోళ్ళ ప్రశంసలందుకొంది గ్రహం' నవల.
శంకర శాపగ్రస్తుడు రామప్రభు పోతన అంశ, విష్ణుదేవుని కురిసి కష్టాల కడలి ఈదుతూ సమాజహితం కూర్చే రచన ఆదరణ పొంది తరిస్తాడు. అతనికి పోటీగా రచయితగా నల్లారావు పేరుతో సైతానును పుట్టిస్తాడు. శివుడు.............