• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Edu 7 Varala Nagalu

Edu 7 Varala Nagalu By Unguturi Sri Lakshmi

₹ 125

కళ్యాణ గమకాలు!

"కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదు" అని ఓ సామెత ఉంది. ఆడపిల్ల పెళ్ళి చెయ్యాలంటే ఎన్ని జతల చెప్పులు అరగాలో అనేవాళ్ళు. ఇప్పుడు ఆ బాధలేదు. ఇంటర్నెట్లు వచ్చి ఇంతుల పెళ్ళిళ్ళు ఈజీ అయినాయి.

మారిన కాలంతో పాటు వివాహ వ్యవస్థలోనూ వింత మార్పులే వచ్చాయి. పెళ్ళిచూపుల నుంచీ, పెళ్ళితంతు దాకా ఆచార వ్యవహారాలకి తిలోదకాలిచ్చి, ఆడంబరాలకి పెద్ద పీట వేస్తున్నారు.

పదిహేనేళ్ళ క్రితం పెళ్ళిచూపులంటే అటు వధువుకి, యిటు వరుడికీ కూడా ఒక చక్కని అనుభూతి. కుటుంబాలకీ, సాంప్రదాయాలకీ విలువ యిచ్చేవారు. పెద్దలు. నిర్ణయం పిల్లలదే అయినా అది పెద్దల ద్వారా ఆమోదం పొంది వివాహ నిర్ణయం చేసేవారు. ఇక అక్కడి నుంచీ పెళ్ళి హడావిడి మొదలయ్యేది.

విఘ్నేశ్వరుడిని పూజించి పసుపు దంచేవారు ముత్తయిదువులు. అది పెళ్ళి పనులకు ప్రారంభం. తిరగలితో పప్పు విసిరి, వడియాలు పెట్టేవారు. అప్పడాలు తయారు చేసేవారు. అప్పడాలకి అక్కడక్కడ చిల్లులు పెట్టి వాటిని వరసయినవారికి వడ్డించేవారు.

వదినలు, బావలు ఆట పట్టిస్తుంటే వధువు మొఖంలో దోబూచులాడే సిగ్గుతెరలను చూసితీరవలసిందే. కళ్యాణ తిలకం, బుగ్గనచుక్క, రెండు చేతులకూ ఎఱ్ఱగా పండిన గోరింట, పాదాలకి పారాణి పెట్టగానే పెళ్ళికళ వచ్చేస్తుంది.

ఇరవై ఏళ్ళక్రితం వివాహ తంతుకి కూడా ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు. పెళ్ళికూతురు చేత గౌరీపూజ చేయించటం, విడిదిలో పెళ్ళికొడుక్కి వరపూజ చేసి మేళాలతో, కళ్యాణ మంటపానికి తీసుకురావటం అదో వేడుక. కన్యావరణాలు....................

  • Title :Edu 7 Varala Nagalu
  • Author :Unguturi Sri Lakshmi
  • Publisher :Sahitya Acadamy
  • ISBN :MANIMN6211
  • Binding :Papar Back
  • Published Date :Feb, 2025
  • Number Of Pages :152
  • Language :Telugu
  • Availability :instock