ఎన్నికల జీవిత చరిత్ర - జీవన విధాన చరిత్ర
ఏడుకో బాయి ఎన్నికల శతకం చదువుతుంటే నాకు ఎందుకో మాకియవెల్లి గుర్తొచ్చాడు. కారణం నేను స్పష్టంగా వివరించలేను. ఆధునిక రాజనీతి శాస్త్ర పితామహుడిగా మాకియవెల్లి ఎంతటి 'పేరు మోసిన' వాడో నేను చెప్పనవసరం లేదు. రోమన్ సామ్రాజ్యంలో ఇటలీ పురావైభవాన్నో, జ్వాజ్జ్వల్యమాన గతాన్నో పునరావిష్కరించాలన్న మహాస్వప్నంలో ఇటలీ ఏకీకరణ కోసం పరితపించాడు. నేపిల్స్, మిలాన్, వెనిస్, ఫ్లోరెన్స్, రోమ్లు విడివిడిగా కాకుండా ఒక్కటైపోవాలని, వాటిని ఏకీకరించే శక్తి సామర్థ్యాలు ఫ్లోరెన్స్ యువరాజుకున్నాయని నమ్మి ‘The Prince' అనే ప్రఖ్యాత రచన చేశాడు. నీతి, నిజాయితీ, ధర్మం స్థానంలో ఏం చేసైనా సరే ఆ రాజు ఆ అయిదింటినీ ఒక్కటిగా చేయమని సలహాలు, సూచనలు, ప్రతిపాదనలు లాంటివి పాలకుడికి విన్నవించాడు ప్రిన్స్లో. ఏం చేసినా సరే పదవి పొందటం, దానిని కాపాడుకోవటం, తిరిగి పొందటం, మళ్లీ మళ్లీ కాపాడుకుంటూ ఉండటం ముఖ్యం. సరే, మాకియవెల్లి లక్ష్యం వేరు. అతని ఆకాంక్ష వేరు. కుటిల రాజనీతిని అనుసరించినా సరే, అబద్ధం, అసత్యం, అన్యాయం, అక్రమం, కుట్ర, కుహకం నడిపినా సరే, అధికారం ముఖ్యం. బంధుప్రీతి, ఆశ్రిత జన పక్షపాతం, స్వార్థం యింకా ఇట్లాంటివి వెయ్యిన్నొక్కటి జాబితీకరించినా సర్వోత్కృష్ట లక్ష్యం గెలవటం, పదవిలో ఉండటం. ఆధికారం చెలాయించటం. అందుకేనేమో మాకియవెల్లీయ రాజకీయాలు అనేమాట శాశ్వతంగా స్థిరపడింది.
మనకు మాకియవెల్లితో పరిచయం లేకపోతే, ఊసరవెల్లితో పరిచయం ఉంది. కనుక, మనం మన దేశీయ రాజకీయాలను 'ఊసరవెల్లీయ' రాజకీయాలు అని పిలుచుకుందాం. ఎప్పుడో 1513లో ఆ రాజనీతి శాస్త్రవేత్త రూపొందించిన 'బ్లూప్రింట్' ఇప్పటికీ చక్కగా ఉపకరిస్తూ ఉన్నది. ఎన్నికల శతకంగా దీనిని ఏనుగు నరసింహారెడ్డి ఏదో వినయంగా పిలుస్తున్నారు. కానీ మాకియవెల్లీ ప్రిన్స్ ఎంతటి రచనో నాకు ఈ...................