ఏ పూర్వ పుణ్యమో - ఏ దాన బలమో
ముందుమాట
అతి సనాతనమైన హిందూ ధర్మానికి ప్రాణం కర్మ సిద్ధాతం. చేసుకున్న కర్మను అనుసరించే ఎవరి జీవితమైనా ఆధారపడి ఉంటుంది. ఒకే ఇంట్లో, ఘడియ తేడాతో, ఒకే సారి పుట్టిన కవల పిల్లలైనా సరే, ఒక్కొక్కరి జీవితం ఒక్కోలా ఉంటుంది. ఓ పిల్లవాడిది దూసుకుపోయే మనస్తత్వమైతే, మరొకడిది అన్నిటికీ భయపడిపోయేతత్వమై వుంటుంది. ఒకే తల్లి తండ్రులు, ఒకే ఇల్లు, ఒకే పాఠశాల, ఒకే వాతావరణం: అయినా ఒక్కొక్కరు ఒక్కో భిన్నమైన లక్షణాలతో ఎదుగుతుంటారు.
ఒక వ్యక్తి విజయాన్ని, ఆ వ్యక్తి యొక్క కృషి తో పాటు, ఆ వ్యక్తి గతంలో చేసుకున్న పుణ్య కర్మలు, దాన ధర్మాలు, తన తల్లి తండ్రులు చేసుకున్న సత్కర్మలు, ఆశీర్వచనాలు అత్యంత ప్రభావితము చేస్తాయి.
ఆ వ్యక్తి తెలివైన వాడే కాకపోవచ్చు, వ్యాపార వ్యూహాలు రచన చేసి అమలు చేయగల నేర్పరే కాకపోవచ్చు. కాని ఎంతో అనుభవము వున్న మహా మహా మేధావులే చతికిలబడి చితికిపోయిన ఆ వ్యాపారరంగములో, ఆ వ్యక్తి మాత్రం అత్యున్నత శిఖరాలు అందుకుంటూ సమాజములో ప్రముఖుడుగా చలామణి అవుతుంటాడు.................