₹ 120
చుదువరులకు విన్నపం.
ఈ పుస్తకంలోని 100 యోగాలు ఈ కాలం యొక్క పరిస్థితులనుద్దేశించి వ్రాయబడినాయి. కొన్ని ముఖ్యమైన గృహ, సంతాన యోగల్లాటివి నా పుస్తకం "శ్రీకృష్ణ జైమిని జ్యోతిష్య సిద్ధాంతము" అనే గ్రంథంలో సోదాహరణముగా వివరించడం వలన ఈ 100 యోగాలలో వాటిని వదిలివేయడం జరిగింది. చాలా వరకు సాంప్రదాయ బద్ధంగానే పుస్తకం నడిపించి సర్వులకూ అర్ధం అయి అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో, ఈ పుస్తకాన్ని "శ్రీ కృష్ణమూర్తి పద్ధతి" లో కొంత వరకూ నడిపించి సంప్రదాయాన్ని కూడా విడిచిపెట్టలేదు. అయితే నిజమైన కృష్ణ మూర్తి పద్ధతి సబ్ తోనూ సబ్ సబ్ తోను నడుస్తుంది. అయితే ఒకేసారి మొత్తం పద్ధతి అంతా బోధించితే అర్ధం అవదు కాబట్టి నెమ్మదిగా అర్ధం చేసుకోడానికి వీలు కల్పిస్తూ నక్షత్రాల లెవెలులోనే పరిశోధించి వ్రాయవలసివచ్చింది. సబ్ ల జోలికి అసలు పోలేదు. అందువలన ఈ పుస్తకాన్ని అన్ని తరగతుల జ్యోతిష్యులు చదవవచ్చును. భావాలు చూసే పద్దతి మాత్రం శ్రీకృష్ణ మూర్తి పద్ధతి ప్రకారమే అనుసరించాను. శ్రీ పతియము అనుసరించలేదు.
- ER. శివల సుబ్రహ్మణ్యం
- Title :Ee Taraniki Nuru Jyothishya Yogalu
- Author :Sivala Subrahmanyam
- Publisher :Gollapudi Veeraswami Son
- ISBN :GOLLAPU380
- Binding :Paperback
- Published Date :2018
- Number Of Pages :171
- Language :Telugu
- Availability :instock