ఈ నాటకంలో మొత్తం 46 పద్యాలున్నాయి. తిక్కన గారి రచనా శైలిని "నాటకీయత" అన్నారు విమర్శకులు. కవి తాను చెపుతున్నట్లు , వర్ణిస్తున్నట్లు ఉండటంకన్నా కళ్ళఎదుట జరుగుతున్నట్లు - మనుషులు మాట్లాడుకుంటున్నట్లు ఉంటుంది. అందుకని తిక్కనగారివి 25 పద్యాలను తీసుకోని యధాతధంగా పాత్రలకు ఇచ్చేసారు. 21 మాత్రం తాను వ్రాసారు. |