• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Eesap Neeti Kathalu ఈసఫ్‌ నీతి కథలు

Eesap Neeti Kathalu ఈసఫ్‌ నీతి కథలు By Sri Pallavi

₹ 150

ఒక గద్ద, నక్క స్నేహితులయ్యారు. వారిద్దరూ ఒకరికొకరు తోడుగా జీవించాలని నిశ్చయించుకున్నారు. ఈ కలయిన ఇద్దరికీ ఉపయోగమని కూడా భావించారు. గద్ద పైకెగిరి చెట్టుపై ఓ గూడు కట్టుకొని నివసించేది. నక్క ఎగరలేదు కనుక చెట్టు మొదట్లో పొదలమాటున నివసించేది. కొంతకాలానికి నక్కకు ఓ పిల్ల జన్మించింది. ఒకరోజు పిల్లను వదలి ఆహారం కొరకు నక్క వేరే ప్రాంతానికి వెళ్ళగా ఆకలితో ఉన్న గద్ద నక్క పిల్లలను ఎగరేసుకుపోయి తన పిల్లలతో కలిసి భుజించింది. నక్క తిరిగి వచ్చి చెట్టుపైనున్న గద్దను చేయగలిగింది లేక తిట్టుకుంటూ ఆ పరిసర ప్రాంతాలలోనే దు:ఖిస్తూ నివసించేది. దానికి పైకెగరే శక్తిలేదు కనుక అలాగే దాన్ని తిట్టుకుంటూ ఉండేది. ఎంతోకాలం గడవకముందే తన స్నేహితుడికి కల్గించిన హానికి గద్డ మూల్యం చెల్లించుకుంది. ఒకానొక రోజు కొందరు మనుషులు ఒక గొర్రెను బలి ఇస్తూ దాన్ని కాల్చుతున్నారు. గద్ద అందులో ఒక ముక్కను దొంగిలించి పైకెగరగా ఓ నిప్పుకణిక గద్ద ఈకకు అంటుకుంది. అది దాని కొమ్మపైగల గూటికి చేరగానే ఆ మంటలకు గూడు కాలి పిల్లగద్దలు ఎగరలేక చెట్టుకింద పడిపోగా ఆ సమయం కోసం ఎదురు చూస్తున్న నక్క వాటిని తినివేసింది. నీతి : స్నేహితుల్ని నువ్వు మోసం చేస్తే ఎప్పుడో ఒకప్పుడు స్వర్గం నిన్ను మోసం చేస్తుంది. ఇలాంటి ఈసఫ్‌ నీతి కథలు - శ్రీ పల్లవి గారు రూపొందించిన ఈ పుస్తకంలో మరో 383 ఉన్నాయి. ఇవన్నీ పిల్లలకు విజ్ఞానంతోపాటు వినోదాన్ని పంచేవే.

  • Title :Eesap Neeti Kathalu ఈసఫ్‌ నీతి కథలు
  • Author :Sri Pallavi
  • Availability :outofstock