నిజమైన రాకుమారి
పూర్వకాలంలో ఒక రాకుమారుడు ఉండేవాడు. ఆ రాకుమారుడు ఒక రాకుమారిని పెళ్లాడాలనుకొన్నాడు. కాని ఆమె నిజమైన రాకుమారిగా ఉండాలని అతని ఉద్దేశం. అలాంటి రాకుమార్తె కోసం దేశాలన్నీ తిరిగాడు. ఏ రాకుమార్తెను చూసినా ఏదో ఒక లోపం కనిపించేది. లోకం మీద రాకుమార్తెలు చాలా మంది ఉన్నారు. కాని వాళ్లు నిజమైన రాకుమార్తెలౌనో కాదో తెలుసుకోవటం అతని వల్ల కాలేదు. అందరిలోనూ ఏదో ఒక లోపం అతనికి కనపడేది. పాపం! నిజమై రాకుమారి అతనికి ఎక్కడా కనిపించలేడు. చివరకు నిరాశతో, విచారపడుతూ ఇంటికి వచ్చాడు.
ఒకనాటి సాయంత్రం బ్రహ్మాండంగా గాలివాన వచ్చింది. మెరుపులు మెరిశాయి. ఉరుములు ఉరిమాయి. ఆకాశం చిల్లులు పడినట్లుగా వర్షం ధారలు కట్టి కురిసింది. కన్ను పొడుచుకున్నా ఏమీ కనపడనంత దట్టంగా లోకమంతా చీకటి కమ్మింది. ఇంతలో ఎవరో 'దబదబా' తలుపులు కొట్టిన చప్పుడైంది. రాకుమారుని తండ్రి......................